Chandrababu On CM Jagan : రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం రావాలంటే మళ్లీ టీడీపీ జెండా ఎగరాలి-చంద్రబాబు

రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం రావాలంటే మళ్లీ టీడీపీ జెండా ఎగరాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Chandrababu On CM Jagan : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రోడ్ షో లో వైసీపీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు చంద్రబాబు. సీఎం జగన్ పై చంద్రబాబు విరుచుకుపడ్డారు. కేసులు పెడితే ఎన్ని పెడతారు? ఇంటికొక కేసు పెడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడిపై తప్పుడు కేసు పెడితే ఏమైందని అడిగారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం రావాలంటే మళ్లీ టీడీపీ జెండా ఎగరాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

”నాది విజన్.. వైసీపీది విధ్వంసం. దీని వల్ల పేదలు లబ్ది పొందే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో 8 లక్షల కోట్ల అప్పులు చేసిన సీఎం జగన్ రెడ్డి. ఈ అప్పులు ఎవరు కడతారు? జగన్ కట్టరు, మనమే కట్టాలి. ఉత్తరాంధ్ర భూములు తాకట్టి పెట్టి రూ.23వేల కోట్లు అప్పు చేశారు. ఇలాంటి పెద్ద మనిషి ఉత్తరాంధ్రను అభివృద్ది చేస్తాడా? నందిగామలో ఎమ్మెల్యే సోదరులు ఇసుకలో దోచుకుంటున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

పాదయాత్రలో ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రి ఇప్పుడు కనిపిస్తున్నాడా? సీఎంను కలవనీయకపోవడంతో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుందో మహిళ. ఈ ముఖ్యమంత్రికి మానవత్వం ఉందా? ఇలాంటి ముఖ్యమంత్రి మనకు కావాలా? మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరితాళ్లు వేస్తున్నాడు? జగన్ తండ్రి పేరుతో జిల్లా పేరు ఉంటే మేము మార్చామా..? కానీ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు జగన్ మార్చాడు? జగన్ బటన్ ఇన్ కార్యక్రమం పెట్టుకున్నాడు. సాయంత్రం అవ్వగానే తన ఆదాయంపై లెక్కలు మొదలు పెడతాడు. రానున్న రోజుల్లో కోడికత్తి లాంటి డ్రామాలు జగన్ చాలా ఆడుతాడు. మనం అలెర్ట్ గా ఉండాలి” అని చంద్రబాబు అన్నారు.

కాగా, నందిగామలో చంద్రబాబు రోడ్ షో లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ దుండగుడు చంద్రబాబు కాన్వాయ్ పై రాయి విసిరాడు. ఈ ఘటనలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్(సీఎస్ఓ) మధు గాయపడ్డారు. దీనిపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. పోలీసు బందోబస్తు సరిగా లేదని ధ్వజమెత్తారు. రాయి దాడి ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు.. చంద్రబాబుకు అదనపు భద్రత కల్పించారు. చంద్రబాబు వాహనం చుట్టూ రోప్ పార్టీలను అదనంగా మోహరించారు.