Chandrababu : ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం లెక్కలు వేసుకోకూడదు.. తుపాను బాధితుల్ని వెంటనే ఆదుకోవాలి : చంద్రబాబు

ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ప్రభుత్వం లెక్కలు వేసుకోకూడదన్నారు. మిగ్‌జామ్ తుపాను బాధితులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.

chandrababu

chandrababu..migjam cyclone ..మిగ్‌జామ్ తుపానుపై టీడీపీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండాలని సూచించారు.ప్రభుత్వం సహాయం చేసేవరకు ఎదురు చూడకుండా సహాయం చేయాలని సూచించారు. తాగునీరు, ఆహారం అందేలా చూడాలని చెప్పారు. బాధితులకు సహాయం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబు పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆదేశించారు.

 

ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. (chandrababu) విపత్తు అని తెలిసినా ప్రభుత్వం అప్రమత్తం కాలేదని దీంతో నష్టం ఎక్కువ జరిగిందని రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ప్రభుత్వం లెక్కలు వేసుకోకూడదన్నారు. మిగ్‌జామ్ తుపాను బాధితులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు..వారికి తగిన సహాయం అందించాలని..పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకుని పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

కాగా..మిగ్‌జామ్ తుపాను ఏపీ, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రెండు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. ఈరోజు బాపట్లలో తీరం దాటింది. ఆ ప్రభావంతో ఏపీలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావానికి వేలాది ఎకరాల్లో పంటల నీటమునిగాయి. అకాల వర్షాలతో రైతలు తీవ్రంగా నష్టపోయారు. చేతికందిన పంట నీటిపాలు కావటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు