Nara Chandrababu bail grant
Nara Chandrababu bail grant : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎట్టకేలకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు..పార్టీ నేతలు, చంద్రబాబు అభిమానులు, శ్రేయోభిలాషులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. బెయిల్ మంజూరుతో జైలునుంచి మంగళవారం (అక్టోబర్ 21,2023) సాయంత్రం 4 గంటల సమయంలో బయటకు రాన్నారు. అనంతరం ఈరోజు రాత్రికి రాజమండ్రి నుంచి అమరావతికి చేరుకోనున్నారు. బుధవారం లేదా గురువారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనం తరువాత హైదరాబాద్ కు చేరుకుని టీడీపీ ఆఫీసు పక్కనే ఉన్న ఎల్వీ ప్రసాద్ హాస్పత్రిలో కంటికి శస్త్ర చికిత్స చేయించుకోనున్నారు.
ఇప్పటికే చంద్రబాబు ఓ కంటికి ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలోనే శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ సర్జరీ తరువాత మూడు నెలలకు మరో కంటికి సర్జరీ చేయించుకోవాలని ఆస్పత్రి వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటులో అవినీతి జరిగిందనే ఆరోపణలతో ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ని సెప్టెంబర్ 9న అరెస్ట్ చేశారు. తరువాత కోర్టులో ప్రవేశ పెట్టటంతో చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. దీంతో ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అప్పటినుంచి చంద్రబాబు అక్కడే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్ కోసం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
Chandrababu Bail : చంద్రబాబుకు మధ్యంతర బెయిల్.. హైకోర్టు షరతులు ఇవే..
దీనిపై వాదనలు..ప్రతివాదనలు కొనసాగాయి. వాదనలు జరిగినా తీర్పులు రిజర్వు చేయటం వంటి కీలక ప్రక్రియల్లో భాగంగా ఇప్పటి వరకు బెయిల్ మంజూరు కాలేదు. ఈక్రమంలో మంగళవారం (అక్టోబర్ 31,20230) ఎట్టకేలకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాగా..73 ఏళ్ల చంద్రబాబుకు జైల్లో పలు అనారోగ్య సమస్యలకు గురయ్యారు. స్కిల్ ఎలర్జీతో పాటు..గుండె, ఊపిరి తిత్తులు వంటి శ్వాసకోశ సమస్యలకు గురయ్యారు. కంటికి శస్త్ర చికిత్స చేయించాల్సిన అవసరం..ఆయనకు జైల్లో తగిన వైద్య సదుపాయాలు లేకవటం వంటి పలు విషయాలను ఆయన తరపు లాయర్లు పిటీషన్ల ద్వారా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇటువంటి అంశాలను కోర్టు పరిగణలోకి తీసుకున్న కోర్టు ఎట్టకేలకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ కావటంతో కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు నడుచుకోవాల్సి ఉంటుంది.