vijayawada Mayor
Chandrababu : మున్సిపల్ ఎన్నికలు నేపథ్యంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుుతున్నాయి. ఒకరిపై ఒకరు ఘాటు విమర్శులు చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీపై మండిపడుతున్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రౌడీ అయితే..తాను రౌడీలకే పెద్ద రౌడీని అంటూ బాబు హెచ్చరించారు. నీ గుండెల్లో నిద్రపోతా..అంటూ మంత్రి పెద్దిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. తనతో ప్రజలున్నారు..మీతో రౌడీలున్నారు..
ప్రజలు తిరుగుబాటు చేస్తే..రౌడీలు పారిపోవడం ఖాయమన్నారు. బట్టలిప్పించడం ఖాయమన్నారు. అమరావతి కొత్త రాజధాని..గ్రీన్ ఫీల్డ్ విషయంలో ఒక్క పిలుపునిస్తే..అమరావతిలో ఉన్న రైతాంగం 33 వేల ఎకరాలు..29 వేల మంది ఒక్క రూపాయి తీసుకోకుండా ఇచ్చారన్నారు. ఐదు కోట్ల మంది ప్రజల కోసం తాను అమరావతి కట్టాలని, తాను ప్రణాళిక తయారు చేయడం జరిగిందనే విషయాన్న గుర్తు చేశారు. విజయవాడ మేయర్ గా టీడీపీ అభ్యర్థిగా గెలవకపోతే..మీరు తలెత్తి తిరగలేకపోతారని ప్రజనుద్దేశించి వ్యాఖ్యానించారు.