ఏకలవ్య శిష్యుడు.. గురువు కోసం నెట్టింట్లో వెతికిన సెలబ్రిటీ చెఫ్‌

  • Publish Date - May 12, 2020 / 02:01 PM IST

అతనొక సెలబ్రిటీ చెఫ్.. అయితే అతని గురువు ఎవరో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ చిన్న హోటల్ నడుపుకునే వ్యక్తి.. అతని పేరు సత్యం.. ఇంతకీ ఆ సెలబ్రిటీ చెఫ్ ఎవరో తెలుసా? వికాస్‌ ఖన్నా..  వంటల ప్రావీణ్యంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వికాస్‌.. తను ఇంతవాడు అవడంలో ఒక చిన్న భాగం అయిన గురువుకు గురుదక్షిణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. 

అసలు విషయం ఏమిటంటే? ‘‘స్ట్రీట్‌ బైట్’‌ యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా  వికాస్‌‌కు మాస్టర్‌ చెఫ్‌ సత్యం పరిచయం అయ్యారు. ఈ చానెల్‌లో‌ వచ్చిన సత్యం గారి వీడియో చూసి వికాస్‌ దిబ్బ రొట్టె చేయడం ఎలాగో నేర్చుకున్నాను. ఈ క్రమంలో వికాస్‌‌కు గురువు అయిపోయాడు సత్యం. అయితే లాక్ డౌన్ సమయంలో తన గురువుకు దక్షిణ సమర్పించాలని అనుకున్నాడు వికాస్‌.. దయచేసి ఆయనకు సంబంధించిన వివరాలు తెలియజేయండి అంటూ ఓ ట్వీట్‌ చేశారు.

ట్వీట్ చేసిన కొద్ది గంటల్లోనే వేలాది లైక్‌లు, షేర్‌లతో ట్వీట్ వైరల్ అయ్యింది. అంతేకాదు 24 గంటల్లోనే సదరు సత్యం వివరాలు కూడా తెలిసిపోయాయి. తన గురువు గారి వివరాలు తెలియజేసిందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు వికాస్‌ ఖన్నా.