తిరుమలలోని కళ్యాణకట్ట వద్ద మంగళవారం (ఫిబ్రకరి 5, 2019) న విషాదం చోటు చేసుకుంది. కల్యాణకట్టలో ఆడుకుంటున్న చంద్రిక అనే చిన్నారి ప్రమాదవశాత్తు మూడవ అంతస్తు నుంచి జారిపడింది. జారిపడ్డ చిన్నారిని ప్రధమ చికిత్స కోసం ముందుగా కేకేసీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కు తీసుకెళ్లారని…అక్కడ పల్స్ లేకపోవడంతో అశ్విని హాస్పిటల్ కు తరలించారని డాక్టర్ నర్మద తెలిపారు.
ఆసుపత్రికి చేరుకొనే లోపే చిన్నారి తుదిశ్వాస విడిచింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి తల్లితండ్రులు బ్రతుకుదెరువు కోసం గత 8 సంవత్సరాలుగా తిరుమలలోని పలు హోటల్ లో పనిచేస్తూ తిరుమలలోని కళ్యాణకట్ట వద్ద ఉన్న షెడ్ లో నివాసం ఉంటున్నారు.