Ka Paul - Janasena (Photo : Google)
Ka Paul – Janasena : తనదైన చేష్టలతో, విచిత్రమైన మాటలతో విభిన్నమైన హావభావాలతో నిత్యం న్యూస్ లో ఉండే వ్యక్తి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul). ఆయన మాటలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఆయన ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఆయనకే తెలియదు. ఎంత సీరియస్ గా మాట్లాడినా అందులో సీరియస్ నెస్ ఉండదని, చాలా కామెడీగా అనిపిస్తాయన్నది జనాల అభిప్రాయం. కేఏ పాల్ మాటలు కడుపుబ్బా నవ్వులు పూయిస్తాయన్నది మరికొందరి మాట. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. కేఏ పాల్ మాత్రం తగ్గేదేలే అంటూ నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారుతుంటారు.
తాజాగా జనసేన(Janasena) గురించి కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. జనసేనను బీజేపీలో(BJP) విలీనం చేయాలని చిరంజీవి, పవన్ కల్యాణ్ (Chiranjeevi, Pawan Kalyan) మాట్లాడుకున్నారట. ఇందుకోసం 5వేల కోట్లకు జనసేనను బేరం పెట్టారట. దీని వెనుక మాస్టర్ మైండ్ అల్లు అరవింద్(Allu Arvind) అని బాంబు పేల్చారు కేఏ పాల్.(KA Paul)
ఈ సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు పాల్. ”మనకు అన్యాయం చేసిన మోదీకి పవన్ ఓటేయమంటున్నాడు. జనసేనకు ఒక్క ఓటేసినా మోదీకి ఓటేసినట్లే. చిరంజీవి, పవన్ డ్యాన్సులు చేసి లక్షల కోట్ల అప్పులు తీరుస్తారా? నేనైతే 10 లక్షల కోట్ల అప్పును ఒకేసారి తీర్చేస్తా. పవన్ చేసేది వారాహి యాత్ర కాదు మోదీ యాత్ర. వచ్చే నెలలో విజయవాడలో ప్రజాశాంతి రాష్ట్ర పార్టీ కార్యాలయం ప్రారంభిస్తున్నా’ అని కేఏ పాల్ అన్నారు.
”జనసేన పార్టీలో చేరేందుకు చిరంజీవి సిద్ధంగా ఉన్నారు. జనసేనలో చేరడంపై చిరంజీవి లీక్స్ ఇస్తున్నారు. ఆయన జనసేన వైపు వెళతారని నేను ముందే చెప్పా. అసలు, సిగ్గుంటే ఎవరైనా జనసేనలో చేరతారా? చిరంజీవి, పవన్ కల్యాణ్ ప్రజలను మాయ చేస్తున్నారు. వారి మాటలు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. 2024 ఎన్నికల తర్వాత బీజేపీలో జనసేన విలీనం తథ్య. ప్రస్తుతం పవన్ కల్యాణ్ విశాఖలో చేస్తున్న వారాహి యాత్ర కూడా బీజేపీ కోసమే. దీనిపై చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగేంద్రబాబులతో చర్చించేందుకు నేను సిద్ధం. అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేసేందుకు రూ.5వేల కోట్లు తీసుకున్నారు” అని ఆరోపణలు చేశారు కేఏ పాల్.
Also Read..Tirupati: తిరుపతి బరిలో వైసీపీ కొత్త అభ్యర్థి.. తెరపైకి డాక్టర్ శిరీష పేరు!?
ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు కేఏ పాల్. ఏపీ, తెలంగాణలో రాజకీయం ఎలా ఉండబోతోంది? అనేది ఆయన ముందుగానే అంచనా వేస్తున్నారు. ఎన్నికలకు ముందు జరబోయేది ఇదే అని ఫ్యూచర్ చెప్పేస్తున్నారు. తనదైన మాటలతో మంటలు పుట్టిస్తున్నారు. తాజాగా బీజేపీలో జనసేనను విలీనం చేసేందుకు చిరంజీవి, పవన్ కల్యాణ్ 5వేల కోట్లకు బేరం మాట్లాడుకున్నారు అంటూ కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కొందరు కేఏ పాల్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంటే, మరికొందరు పిచ్చ కామెడీ అని కొట్టి పారేస్తున్నారు. బీజేపీలో జనసేన విలీనం అంటూ.. కేఏ పాల్ వ్యాఖ్యలను జనసైనికులు మాత్రం లైట్ తీసుకున్నారు. పాల్ సార్ ఎప్పుడూ అంతే, పిచ్చ కామెడీ చేస్తుంటారు, కడుపు చెక్కలయ్యే జోకులు పేలుస్తుంటారు అని వెటకారం చేస్తున్నారు.