CID Notices To Narayana : మాజీ మంత్రి నారాయణకు CID నోటీసులు

టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

Ex minister Narayana

Ex minister Narayana CID issued notices :  టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో స్కామ్ జరిగిందనే ఆరోపణలతో ఇప్పటికే నారా లోకేశ్ కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. లోకేశ్ A14 గా పేర్కొంటున్న సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈక్రమంలో ఇదే కేసులో ఏ2 గా ఉన్న నారాయణకు కూడా నోటీసులు జారీ చేశారు. 4వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మెయిల్ ద్వారా నారాయణకు సి ఐడి నోటీసులు పంపించారు. నారా లోకేశ్ తో పాటు తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Nara Lokesh: విజిల్స్ వేసి సౌండ్ చేశారని 60 మందిపై కేసా? వాళ్లకు బుర్రా బుద్దీ ఏమైంది..? ఢిల్లీలో లోకేశ్ దీక్ష

కాగా చంద్రబాబు అరెస్ట్ తరువాత ఢిల్లీ వెళ్లిన లోకేశ్ అప్పటినుంచి అక్కడే ఉన్నారు. ఢిల్లీలో ఉన్న నారా లోకేశ్ కు సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. 4వ తేదీ ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో లోకేశ్ ను ఏ14గా సీఐడీ అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా నారాయణకు కూడా నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశించారు.