Ongole Police
Ongole: ఒంగోలు జేఎంబీ చర్చి ప్రార్థనా సమయంలో ఇరు పాస్టర్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈస్టర్ డే కావడంతో ఒంగోలులోని శ్రీగిరి కొండపైకి ప్రార్థనల నిమిత్తం జ్యూయెట్ మెమొరియల్ బ్యాక్ పీస్ ప్రేయరీ హిల్స్ చర్చికి వెళ్లారు.
సెక్రటరీ నేనంటే నేనని గొడవలు మొదలయ్యాయి. ఫాస్టర్ ప్రసాద్ రావు వర్గానికి చెందిన మనోజాగ్ణ కుమార్ సెక్రటరీ కాదని తమ వర్గానికి చెందిన వారే సెక్రటరీ హోదా కలిగిన వారంటూ అగస్టీస్ వర్గం గొడవకు దిగింది.
మాటా మాటా పెరగడంతో ఇరువర్గాల మీద దాడి పెరిగింది. ఈ క్రమంలోనే మనోజాగ్ణ కుమార్‌పై ఫాస్టర్ అగస్టీస్ వర్గం వారు పిడిగుద్దులు కురిపించాడు. తీవ్ర గాయాలతో టూటౌన్ ఫాస్టర్ ప్రసాద్ రావు పోలీసులను ఆశ్రయించింది.
Read Also : గొడవలు పోయి కొట్టుకునేదాకా వెళ్లిన బిగ్‌బాస్ కంటెస్టెంట్స్
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు.