టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ.. పెళ్లి బృందంపై కర్రలు, ఇటుకలతో దాడి..

ఏపీలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపుపై దాడికి పాల్పడ్డారు.

Andhrapradesh: ఏపీలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా కోసిగిలో టీడీపీ వర్గీయుల పెళ్లి ఊరేగింపుపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు.

 

టీడీపీ నేత తాయన్న కొడుకు ఈరన్న పెళ్లి ఊరేగింపులో వైసీపీ వర్గీయులు దాడిచేశారు. పెళ్లి బృందంపై కర్రలు, ఇటుకలతో దాడి చేయడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పెళ్లి ఊరేగింపు వాహనంపై ఎక్కి వైసీపీ కార్యకర్త తొడగొట్టి హల్చల్ చేశాడు. ఫ్యాన్ సింబల్ తిప్పుతూ పెళ్లి బృందంపై దాడి చేశారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. 12 మంది వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 

వైసీపీ కార్యకర్తల దాడిని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఖండించారు. వైసీపీ కార్యకర్తల దాడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారు వైసీపీ ఎంపీపీ ఈరన్న సోదరుడు వెంకయ్య వర్గీయులుగా గుర్తించారు.