గత పాలకుల వల్లే మీకు ఇన్ని కష్టాలు వచ్చాయి, పదిన్నర లక్షల కోట్లు అప్పులు చేశారు- వరద బాధితులతో సీఎం చంద్రబాబు

వరదల్లో నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకోవటంతో పాటు ఆదాయం వచ్చే మార్గాలు కల్పిస్తా.

 

Vijayawada Floods : విజయవాడలోని కబేళా సెంటర్ వరద బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాలు తీర్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామని ఆయన చెప్పారు. నాతో సహా మంత్రులు, అధికారులు అంతా బురదలోనే తిరుగుతున్నారని తెలిపారు. బుడమేరకు గండ్లు పడినా గత పాలకులు పూడ్చకుండా పట్టించుకోని ఫలితమే మీకు ఇన్ని కష్టాలు వచ్చాయని చంద్రబాబు వాపోయారు. బుడమేరు ప్రాంతాన్ని కబ్జా చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. 9 రోజులుగా మీరు పడిన బాధలు వర్ణనాతీతం అని ఆవేదన వ్యక్తం చేశారు.

”ప్రభుత్వానికి ఎన్నో కష్టాలు ఉన్నాయి. పదిన్నర లక్షల కోట్ల అప్పు చేసి దిగిపోయాడు. ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లు వెనుకా కుట్ర ఉంది. వచ్చి ఈ బురదలో తిరిగి ఉంటే చేసిన పాపాలు కొంతైనా పోయేవి. కానీ బెంగుళూరులో కూర్చుని మాపై బురద చల్లుతున్నాడు. ఇంత పెద్ద మహా యజ్ఞంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా అధిగమించుకుంటూ ముందుకెళ్తున్నాం. వరదల్లో నష్టపోయిన వారిని అన్ని విధాల ఆదుకోవటంతో పాటు ఆదాయం వచ్చే మార్గాలు కల్పిస్తా. ఉపాధి కోల్పోయిన వారికి ఇంట్లో ఉండే ఆదాయం సమకూర్చుకునేలా చేస్తా’ అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

అటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ సీఎం చంద్రబాబు పర్యటించారు. ఊర్మిళా నగర్ స్వాతి రోడ్డు, కబేళా సెంటర్, సితార సెంటర్, జ్యోతి నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులతో చంద్రబాబు మాట్లాడారు. ”వరదల వాళ్ళ మీకు ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవం. ఐఏఎస్ ఆఫీసర్లు అందరం బురదలోనే ఉన్నాం. అందరం కష్టపడుతున్నాం. మీ ఇంట్లో గృహోపకరణాలు ఫ్యాన్, ఫ్రిడ్జ్, టీవీ, స్టవ్ అన్నీ మేమే రిపేర్ చేపిస్తాం. ఇది గాక మీకు ఎంతో కొంత ఆర్థిక సాయం కూడా చేసే విధంగా ఆలోచిస్తున్నాం.

Also Read : ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లలో కుట్ర కోణం బలపడుతోంది- మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు

మీకు ఏ ఇబ్బందులు రాకుండా చూస్తాను. ఇన్సూరెన్స్ ఉన్న వాహనాలకి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చేస్తాం. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. ఇంటింటికి రేషన్, కూరగాయలు అందిస్తున్నాం. వరద ప్రాంతాల్లో ఇంకా వాటర్ బాటిల్స్, ఆహారం, పాలు, బిస్కెట్లు ఇంటింటికి అందిస్తున్నాం. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తోప్పుడు బండ్ల వ్యాపారులకు, ఆర్థికంగా చితికిపోయిన వారిని ఆదుకుంటాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు