Cm Chandrababu Naidu
Cm Chandrababu Delhi Tour : ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 7న ఆయన హస్తినకు వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అమరావతికి రావాల్సిన ప్రపంచ బ్యాంకు నిధులు, రైల్వే ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది.
ఇప్పటికే సీఎం చంద్రబాబు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అపాయింట్ మెంట్ కోరినట్లు సమాచారం. వైజాగ్ రైల్వే జోన్ భూమి పూజ ముహూర్తంపై అశ్విని వైష్ణవ్ తో డిస్కస్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు అటు వరదలపై మరింత కేంద్ర సాయం కావాలని చర్చించే అవకాశమూ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : వైసీపీ సీనియర్ నేత దారెటు? ఆయనను వెంటాడుతున్న ఆ భయం ఏంటి..