నా జోలికొస్తే తాటతీస్తా కేసీఆర్ : చంద్రబాబు వార్నింగ్

కేసీఆర్ ఖబడ్దార్.. జాగ్రత్తగా ఉండు అని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ‘నోరు అదుపులో పెట్టుకోవాలని.. నా జోలికొస్తే తాటతీస్తా..

  • Publish Date - April 9, 2019 / 09:34 AM IST

కేసీఆర్ ఖబడ్దార్.. జాగ్రత్తగా ఉండు అని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ‘నోరు అదుపులో పెట్టుకోవాలని.. నా జోలికొస్తే తాటతీస్తా..

కేసీఆర్ ఖబడ్దార్.. జాగ్రత్తగా ఉండు.. నా జోలికొస్తే నీ తాట తీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. ‘నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరించారు. నా జోలికొస్తే తాటతీయటమే కాదు.. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తేలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. నీ మాదిరిగా నేను నోటికొచ్చినట్లుగా మాట్లడను అంటూనే తాటతీస్తానంటూ అదేస్థాయిలో రెచ్చిపోయారు చంద్రబాబు. ‘నీకు, నరేంద్రమోడీకి బుద్ధి రావాలంటే.. నీ భాష వాడితే తప్ప బుద్ధి రాదు అన్నారు. 100 మంది నరేంద్రమోడీలు, 500 మంది కేసీఆర్ లు, వెయ్యి కోడి కత్తులు వచ్చినా ఏం చేయలేరన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి
Read Also : వైసీపీకి అడ్రస్ ఉండదు.. డిపాజిట్ కూడా దక్కదు

హైదరాబాద్ లో ఆంధ్రావాళ్లకు ఏం పని అంటున్నారు.. మరి తెలంగాణ నేతలకు ఏపీలో ఏం పని అని ప్రశ్నించారు. ‘మేం తాగే నీళ్లపై మీ పెత్తనం అవసరమా? అని నిలదీశారు. కోడి కత్తి పార్టీకి సిగ్గులేదని వైఎస్సార్ కాంగ్రెస్ ను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. జగన్ 24 రోజులు అసెంబ్లీకి వచ్చారని.. 242 రోజులు కోర్టుకు వెళ్లారని విమర్శించారు. మన సంకల్పం ఉక్కు సంకల్పం అన్నారు. రాళ్ల సీమను రతనాల సీమగా మారుస్తామని హామీ ఇచ్చారు. జాబు రావాలంటే బాబు కావాలి.. జాబు కావాలంటే బాబే ఉండాలి అని అన్నారు. 
Read Also : లక్ష్మీపార్వతి జోస్యం : వైసీపీకి 125 ఎమ్మెల్యే , 22 ఎంపీ సీట్లు ఖాయం