AP Nominated Posts : ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ జాతర మొదలైంది. 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించింది కూటమి ప్రభుత్వం. 47 మార్కెట్ కమిటీలకు గాను 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేయబోతున్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరపబోతున్నారు. ప్రస్తుతం ప్రకటించిన 47 ఏఎంసీ ఛైర్మన్ పదవుల్లో 37 టీడీపీ, 8 జనసేన, 2 బీజేపీలకు కేటాయించారు. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీ ఛైర్మన్లను కూడా ప్రకటించబోతున్నారు.
టీడీపీలో రెండవ శ్రేణి నేతలకు కూడా పదవుల పండగ కనిపిస్తోంది. ప్రతి నియోజకవర్గానికి ఉండే మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ పోస్టులను ఇవాళ భర్తీ చేశారు. దాదాపు 47 స్థానాలను భర్తీ చేశారు. ప్రతి నియోజకవర్గంలో రెండోవ శ్రేణి నేతలంతా మార్కెట్ కమిటీలను చాలా ప్రతిష్టాత్మకంగా చూస్తుంటారు. ఈ పోస్టును దక్కించుకునేందుకు అనేరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రస్తుతానికి కూటమి సర్కార్ 47 స్థానాలను భర్తీ చేసింది. చాలా మందికి అవకాశం కల్పించింది. మరో 100కు పైగా భర్తీ చేయాల్సి ఉంది. తొందరలోనే అవి కూడా భర్తీ చేస్తామని చెబుతున్నారు.
Also Read : రచ్చకెక్కిన తిరువూరు టీడీపీ గ్రూప్ రాజకీయాలు.. భగ్గుమంటున్న నేతలు
ఇవాళ 47 స్థానాలు భర్తీ చేయగా.. 37 టీడీపీ తీసుకుంది. జనసేన 8 తీసుకోగా, బీజేపీకి రెండు కేటాయించారు. మరో 100 మార్కెట్ యార్డ్ కమిటీలు ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలో భర్తీ చేస్తామన్నారు. వీటి భర్తీకి ప్రజాభిప్రాయ సేకరించారు. ఆయా నియోజకవర్గాల్లో ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయం తీసుకుని ఛైర్మన్లగా ఎంపిక చేశారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి పదవులన్నీ దాదాపుగా పూర్తి చేశారు.