Chandrababu Naidu: మహిళల కోసం గేమ్‌ ఛేంజర్‌లాంటి పథకాలు.. చంద్రబాబు వ్యూహం ఇదేనా?

త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం స‌ర్కార్‌ గ్రాఫ్‌ను కొంతలో కొంతైన పెంచిందనే చెప్పొచ్చు. ఇప్పుడు స్త్రీ శక్తి స్కీమ్‌తో ప్రతీ మహిళ ఎప్పుడో ఒకసారి బస్ ఎక్కుతారు.

CM Chandrababu Naidu

CM Chandrababu Naidu: ఏపీలో మహిళా ఓటర్లు ఎక్కువ. దాదాపు రెండు కోట్ల 62లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వాళ్లు ఎటువైపు మొగ్గితే వాళ్లదే గెలుపు.

అందుకే రాబోయే ఎన్నికల్లోనూ మళ్లీ గెలిచేందుకు మహిళల ఓట్లన్నీ కూటమి వైపునకు మళ్లించేందుకు సీఎం చంద్రబాబు పక్కా టార్గెట్‌ ఫిక్స్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. కన్ఫ్యూజన్‌ లేదు.

డైలమా అంతకంటే లేదు. మళ్లీ మళ్లీ గెలుస్తామని చెబుతున్నారు. అందుకు అనుగుణంగా పనిచేసుకుంటూ పోతున్నారు.

ఇచ్చిన మాటను ఇచ్చినట్లు అమలు చేసుకుంటూ పోతున్నారు. సూపర్‌ సిక్స్ గ్యారెంటీల్లో కీలక మైన తల్లికి వందనం, స్త్రీ శక్తి స్కీమ్స్‌ను ఇంప్లిమెంట్‌ చేస్తున్నారు.

ఏం చేసినా ఆ రెండు స్కీమ్స్‌ అమలు అంత ఈజీ కాదన్న అభిప్రాయాలు ఉండేవి. ప్రజల్లోనూ..అటు విపక్షంలోనూ ఇదే చర్చ జరిగేది కాని. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..ఏకంగా మహిళల ఆశీర్వాదం పొందే ప్రయత్నం చేస్తున్నారు.

మహిళల నోట ప్రభుత్వంపై పాజిటివ్ టాక్ వస్తే..గెలుపు ఈజీ అవుతుందని..స్కీమ్స్ ఇవ్వట్లేదని మహిళలే ప్రచారం చేస్తే ఇంపాక్ట్ చూపిస్తుందని లెక్కలు వేసుకుని మరీ పనిచేస్తున్నారు.

ఈ స్కీమ్‌ ఇంప్లిమెంటేషన్‌తో అతి పెద్ద అచీవ్‌మెంట్‌  

సూపర్‌ సిక్స్‌ హామీల్లో కీలకమైంది.. మహిళలకు ఉచిత బస్సు. ఈ స్కీమ్‌ ఇంప్లిమెంటేషన్‌తో కూటమి ప్రభుత్వం అతి పెద్ద అచీవ్ మెంట్‌ను సాధించినట్లు అయింది.

ఏపీలో ఈ పథకం కింద లబ్ధి పొందే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుందని అంచనాలున్నాయి. రెండు కోట్ల 62 లక్షల మందికి ఉపయోగపడే విధంగా ఈ పథకాన్ని బాబు రూపకల్పన చేసి శ్రీకారం చుట్టారు.

ఫ్రీ బస్‌తో రాష్ట్రమంతా తిరిగే అవకాశం మహిళలకు దక్కుతుంది. ఆఫీసులకు వెళ్లేవాళ్లు, పనుల కోసం రోజు జర్నీ చేసేవారు..కూలీలు, మహిళా కార్మికులు లక్షలాది మందికి ఈ స్కీమ్‌ ఉపయోగపడనుంది.

ఆకాశంలో సగం అవకాశాలలో సగంగా ఉన్న మహిళలకు ఏపీలో ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిచే బస్సుల్లో సగం కంటే ఎక్కువే ఉచిత బస్సు పథకానికి కేటాయించారు. ఏపీలో 11వేల 449 ఉంటే అందులో ఏకంగా 8వేల 5 వందల బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం.

Also Read: కుమారుడి పేరు రివీల్ చేసిన హీరో నితిన్.. ఫ్యూచర్‌లో హీరోకి ఉండాల్సిన పేరే..

వాస్తవానికి ఫ్రీబస్‌ స్కీమ్ అమలు కాస్త ఆలస్యమైంది. కానీ పూర్తి కసరత్తు చేసి మరీ ఈ పథకాన్ని ప్రారంభించారు. స్త్రీ శక్తి స్కీమ్‌తో మహిళలకు ప్రయాణం ఖర్చులు ఎంత ఆదా అవుతాయో కూడా డేటా ప్రభుత్వం సేకరించి పెట్టుకుంది.

ప్రభుత్వం అంచనా ప్రకారం రాష్ట్రంలోని మహిళలు వివిధ బస్సులలో వారానికి నాలుగు సార్లు ప్రయాణం చేస్తారు. ఉద్యోగులు అయితే రోజూ వారీ కనీసం రెండు నుంచి నాలుగు సార్లు ప్రయాణిస్తారు. దీనికి వారికి నెలకు వేయి నుంచి మూడు వేల రూపాయల వరకు ఖర్చు అవుతోంది.

ప్రయాణ ఖర్చుల భారం తగ్గినట్లే 

ఈ ఉచిత బస్సులతో మహిళల ప్రయాణ ఖర్చుల భారం తగ్గినట్లే. ఏపీలో పేదలు మధ్యతరగతి వర్గాల మహిళలు ఎక్కువగా ఉన్నారు. వారంతా ఈ పథకం ద్వారా లబ్ది పొందుతారని ప్రభుత్వం లెక్కలు వేసుకుంటోంది.

పల్లె వెలుగు, సిటీ బస్సులకే ఈ స్కీమ్‌ పరిమితం చేయాలని అనుకున్నా..ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతిస్తున్నారు.

దాంతో మహిళలు ఈ పథకం ద్వారా ఎక్కువ లబ్ది పొందడమే కాకుండా ప్రభుత్వంపై వారికి పాజిటివ్ ఒపీనియన్‌ ఏర్పడే అవకాశం లేకపోలేదు.

ఇక టీడీపీ హిస్టరీలోనే అతి పెద్ద సంక్షేమ పథకంగా నిలిచిన స్కీమ్‌ తల్లికి వందనం. విమర్శించినోళ్లకు చేతలతోనే సమాధానం చెప్పింది కూటమి సర్కార్. ఒకేసారి పదివేల కోట్లు తల్లులు అకౌంట్లలో జమ చేసి..ప్రతి తలుపు తట్టింది కూటమి సర్కార్.

తల్లికి వందనంతో దాదాపు 95శాతం కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయన్న అంచనాలు ఉన్నాయి.

కనీసం ప్రతీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. అలాగే కొందరికి ముగ్గురు ఉంటారు. వీరికి తక్కువలో తక్కువ ముప్పై నలభై వేల దాకా ఒకేసారి డబ్బు జమ అవుతుంది. అలా త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం స‌ర్కార్‌ గ్రాఫ్‌ను కొంతలో కొంతైన పెంచిందనే చెప్పొచ్చు.

ఇప్పుడు స్త్రీ శక్తి స్కీమ్‌తో ప్రతీ మహిళ ఎప్పుడో ఒకసారి బస్ ఎక్కుతారు. ఫ్రీ టికెట్‌తో ట్రావెల్‌ చేస్తారు. ఇది కూడా కూటమి ప్రభుత్వానికి అడ్వాంటేజ్‌గా మారే స్కీమ్. ఇలా మహిళా ఓట్లే టార్గెట్‌గా చంద్రబాబు (CM Chandrababu Naidu) అమలు చేస్తున్న స్కీమ్స్‌తో కూటమి క్యాడర్‌లో జోష్ పెరుగుతోంది.