చంద్రబాబు ప్రభుత్వ తప్పిదం వల్లే విజయవాడ మునిగింది: కన్నబాబు

రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

KannaBabu

విజయవాడలో వరదల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పందిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. పబ్లిసిటీ కోసమే చంద్రబాబు తాపత్రయ పడుతున్నారని అన్నారు.

రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విజయవాడను చంద్రబాబు నాయుడు ముంచేశారని, ఆయన పాలనలో డొల్లతనం బయటపడిందని చెప్పారు. వర్షాల ప్రభావాలపై చంద్రబాబు నాయుడు ఒక​ సమీక్ష అయినా చేశారా అని నిలదీశారు.

ఏపీలో 20 జిల్లాల్లో వరదల ప్రభావం ఉందని, వెలగలేరు రెగ్యులేటర్‌ గేట్లు ఎత్తుతామని ముందే సమాచారం ఇచ్చారని తెలిపారు. సర్కారుకి ఈ విషయాలు తెలిసినప్పటికీ ప్రజలను గాలికి వదిలేశారని అన్నారు. 45 మంది మృతి చెందినప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని విమర్శించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఏపీలో పునరావాస కేంద్రాలు ఎక్కడున్నాయో కూడా తెలియడం లేదని చెప్పారు.

Kishan Reddy: రాజకీయాలకు అతీతంగా వీరిని ఆదుకుందాం: కిషన్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు