AP Fuel Shortage: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత..! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 10వేల 345 కిలోలీటర్ల పెట్రోల్, 14 వేల 156 కిలో లీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగినట్లు అధికారులు వివరించారు.
- Naveen
- Published on- April 26, 2026 / 04:34 PM IST
AP Fuel Shortage: ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంధన సంక్షోభంతో పలు చోట్ల బంకులు మూతపడుతున్నాయి. ఇంధన కొరతతో బంకుల మూసివేతపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సరఫరా గతం కంటే 10శాతం పెరిగినా పానిక్ కొనుగోళ్లతో 50శాతానికిపైగా డిమాండ్ పెరిగినట్లు అధికారులు వివరించారు. అటు రాష్ట్రవ్యాప్తంగా 4వేల 510 పెట్రోల్ బంకులు ఉండగా 421 బంకులు మూతపడ్డాయని అధికారులు తెలిపారు.
నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 10వేల 345 కిలోలీటర్ల పెట్రోల్, 14 వేల 156 కిలో లీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగినట్లు అధికారులు వివరించారు. సాధారణ అమ్మకం కంటే ఒక్కసారిగా 50 శాతానికి అమ్మకాలు పెరగడంతో బంకుల్లో నిల్వలు తగ్గిపోయాయని అధికారులు వివరించారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే ఇప్పటివరకు ప్రభుత్వ శాఖలు తీసుకున్న చర్యలు, సమస్య పరిష్కారంపై సాయంత్రం లోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
Also Read: ‘ఇదేం రూల్..!?’.. పెట్రోల్ కావాలంటే ఇంజిన్ ఆయిల్ కొనాలా?
