×
Ad

Cm Chandrababu: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ.. చిరంజీవిపై బాలకృష్ణ వ్యాఖ్యల ప్రస్తావన..!

ఏపీ అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించి ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.

Cm Chandrababu: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పరామర్శించారు సీఎం చంద్రబాబు. పవన్ కల్యాణ్ వారం రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధ పడుతున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు చంద్రబాబు. పవన్ కల్యాణ్ ఆరోగ్యం గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు రెస్ట్ అవసరం అని సూచించడంతో పవన్ కల్యాణ్ రెండు మూడు రోజులుగా ఇంటికే పరిమితం అయ్యారు. పవన్ ను కేవలం పరామర్శించారా లేదా తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు చర్చించారా అనేది తెలియాల్సి ఉంది.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సుమారు గంట పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు విషయాలపై పవన్ తో చంద్రబాబు చర్చించారు. ఇక ఇటీవల అసెంబ్లీలో జరిగిన విషయాలపైనా చర్చించినట్లు సమాచారం. తాజా రాజకీయ పరిణామాలపైనా డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై ఇరువురు సుమారు గంట 10 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపినట్లు సమాచారం. చిరంజీవిపై ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపైనా వీరు చర్చించినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఓజీ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి సీఎం చంద్రబాబు పవన్ కు అభినందనలు తెలిపినట్లు సమాచారం.

ఏపీ అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించి ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే బాలయ్యకు చిరంజీవి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. జగన్ తనను అవమానించలేదని తేల్చి చెప్పారు. జగన్ తనను సాదరంగా ఆహ్వానించారని, గత ప్రభుత్వంలో సినీ పరిశ్రమకు మేలు కలిగేలా నిర్ణయాలు తీసుకున్నారని బాలయ్యకు కౌంటర్ ఇచ్చారు చిరంజీవి. ఈ అంశంపైనా చంద్రబాబు, పవన్ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Also Read: కీలక సమయాల్లో పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా మౌనం.. ఎందుకంటే?