Pawan Kalyan : జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌లు ట్విటర్ వేదికగా పవన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: Pawan Kalyan Rare Photos : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్.. పవన్ రేర్ ఫొటోలు చూశారా..?
సీఎం చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా పవన్ కల్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మిత్రులు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అడుగడుగునా సామాన్యుడి పక్షం.. అణువణువునా సామాజిక స్పృహ.. మాటల్లో పదును.. చేతల్లో చేవ.. జన సైన్యానికి ధైర్యం.. మాటకి కట్టుబడే తత్వం.. రాజకీయాల్లో విలువలకు పట్టం.. స్పందించే హృదయం.. అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానుల, కార్యకర్తల, ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి. మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి. పాలనలో, రాష్ట్రాభివృద్దిలో మీ సహకారం మరువలేనిది అని తెలియజేస్తూ.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.’’ అంటూ చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి నారా లోకేశ్ పవన్ కల్యాణ్‌కు ట్విటర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్, జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్‌గా ఎదిగారు. ప్రజల కోసం తగ్గుతారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారు. సొంత తమ్ముడు కంటే ఎక్కువగా నన్ను అభిమానించి, అండగా నిలిచిన పవనన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.’’ అంటూ నారా లోకేశ్ పేర్కొన్నారు.