AP Govt : ఏపీలోని పేదలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఐదు లక్షల మందికి లబ్ధి

AP Govt : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పేదవర్గాల ప్రజలకు శుభవార్త చెప్పారు. సొంతిల్లు లేనివారికి ఊరట కలిగించేలా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Cm Chandrababu Naidu Good News To Poor People of Ap Houses

  • ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
  • పేదలకు సొంతింటి కల సాకారం చేసేలా చర్యలు
  • అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సీఎం

AP Govt : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పేదవర్గాల ప్రజలకు శుభవార్త చెప్పారు. సొంతిల్లు లేనివారికి ఊరట కలిగించేలా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై చంద్రబాబు సమీక్ష చేశారు. ఈ క్రమంలో అధికారులకు కీలక సూచనలు చేశారు.

Also Read : ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు దంచికొట్టనున్న వానలు.. పిడుగులు పడతాయ్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ముఖ్యంగా రాష్ట్రంలో ఈ ఏడాదిలోనే మరోసారి సామూహిక గృహప్రవేశాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 2లక్షల మంది ఇళ్ల స్థలాలు కోరినట్లు సర్వేలో తేలిందని, ఇళ్ల నిర్మాణంతోపాటు స్థలాల పంపిణీ ప్రక్రియ త్వరగా ప్రారంభించాలని గృహ నిర్మాణశాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్లకు అదనంగా మరో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని కూడా పూర్తిచేయాలని, వీటిని పేద వర్గాల్లోని అర్హులైన వారికి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా వీటిని లబ్ధిదారులకు అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇసుక సరఫరాకు వర్షాకాలంలో అవాంతరాలు ఎదురవుతాయని, ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇసుకకు ఎక్కువ చార్జీలు వసూళ్లు చేసేవారిపై నిఘా పెట్టాలని అన్నారు. ఈ ఏడాది మరోసారి సామూహిక గృహప్రవేశాలు ఒకేసారి భారీగా చేపడతామని తెలిపారు. టిడ్కో ఇళ్ల పనులను కూడా వేగవంతం చేయాలని కోరారు.

వర్షాల సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో ముందుగానే ఫోన్లకు పిడుగుపాటు హెచ్చరికలు పంపిస్తున్నామని, అయినా, కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు. సెల్ టవర్ల లొకేషన్ ఆధారంగా పిడుగుపాటు హెచ్చరికల మెస్సేజ్ లు ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తున్నామని, ఇలాంటి సమయంలో క్షేత్ర స్థాయి సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.

రాష్ట్రంలో కళాశాల విద్యను మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. యూనివర్శిటీలతో నిత్యం అనుసంధానం చేసుకోవాలని, సంప్రదాయ కోర్సులతో పాటు డిమాండ్ ఉన్న కోర్సులపై ఫోకస్ పెట్టాలని, అలాగే కొత్త కరిక్యులమ్ ను ప్రవేశపెట్టేలా కసరత్తు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.