అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఎల్జీ పాలిమర్ ప్రమాదం తర్వాత హైపవర్ కమిటీ వేశారు. నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు.

Cm Chandrababu : అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ కంపెనీ భద్రత విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఏ విధంగా ఉంటుందో ఈ ప్రమాదమే నిదర్శనం అన్నారు చంద్రబాబు. ఫార్మా యూనిట్ లో ప్రమాదానికి కంపెనీలో ఉండే విభేదాలే కారణం అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

”ఈ కంపెనీ రెడ్ కేటగిరీలో ఉంది. ఈరోజే నష్టపరిహారం చెల్లిస్తాం. చెక్కులు పంపిణీ చేయ్యాలని ఆదేశాలు జారీ చేశాం. కారణాలు ఏవైనా కావచ్చు. ప్రాపర్ ఎన్ ఓసీ ఫాలో కాలేదు. గత ఐదేళ్లలో 119 ప్రమాదాలు జరిగాయి. అందులో 120 మంది చనిపోయారు. ఎల్జీ పాలిమర్ పాయిజన్ తో కూడిన కెమికల్, ఇక్కడ ఉన్న కెమికల్ హై ప్లేమబుల్. ఎల్జీ పాలిమర్ ప్రమాదం తర్వాత హైపవర్ కమిటీ వేశారు. నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు. ఫర్మ్ యాక్షన్ తీసుకుంటే తప్ప ఈ ప్రమాదాలు ఆగవు.

రెడ్ కేటగిరి పరిశ్రమలు భద్రత పరంగా ఇంటర్నల్ ఆడిట్ చేయండి, లోపాలు సరిచేసుకోండి. ఈ సంఘటన ఆధారంగా చేసుకుని హైలెవల్ కమిటీ వేస్తున్నా. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటాము. ఇండస్ట్రీలో ఉండే అవకతవకలు సరిచూసుకోవాలి. ఈరోజు ప్రమాదానికి కంపెనీలో ఉండే విభేదాలు కారణం. ఇప్పటివరకు యాజమాన్యం బయటకు రాలేదు. సెప్టీ ఆడిట్ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తాం” అని సీఎం చంద్రబాబు తెలిపారు.

 

 

 

 

Also Read : కంపెనీ యజమానుల మధ్య విభేదాలు ఉన్నాయి.. అందుకే..: పవన్ కల్యాణ్

 

ట్రెండింగ్ వార్తలు