అప్పుల పాలు చేశారు, తీవ్ర నష్టం కలిగించారు- విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

గత ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదన్న సీఎం చంద్రబాబు.. విద్యుత్ శాఖలో ఐదేళ్లలో 79శాతం అప్పు పెరిగిందని పేర్కొన్నారు.

White Paper On Power Sector : గత ఐదేళ్లలో వైసీపీ సర్కార్ విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. గత ఐదేళ్లలో ప్రజలపై 32వేల 166 కోట్ల రూపాయల ఛార్జీల భారం మోపారని తెలిపారు. విద్యుత్ రంగంలో 49వేల 596 కోట్ల రూపాయల అప్పులు చేశారని వెల్లడించారు. మొత్తంగా ఐదేళ్లలో విద్యుత్ రంగానికి ఒక లక్ష 29వేల 503 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చంద్రబాబు వాపోయారు. అసమర్థ పాలన, అసమర్థ చర్యల వల్ల విద్యుత్ రంగానికి తీవ్ర నష్టం జరిగిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

పవన విద్యుత్ పై 21 ఒప్పందాలు రద్దు చేసుకున్నారని తెలిపారు. ట్రూఅప్ ఛార్జీల పేరుతో అదనపు భారం వేశారని, గృహ వినియోగదారులపై 45శాతం ఛార్జీలు పెంచారని చంద్రబాబు వివరించారు. 50 యూనిట్లు వాడిన పేదల ఛార్జీలు కూడా 100శాతం పెంచారని చెప్పారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదన్న సీఎం చంద్రబాబు.. విద్యుత్ శాఖలో ఐదేళ్లలో 79శాతం అప్పు పెరిగిందని పేర్కొన్నారు. మరోవైపు వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం సాయం తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు.

Also Read : మాజీ ఎమ్మెల్యేని మోసం చేసిన కేటుగాళ్లు, అలా నమ్మించి 48లక్షలు కొట్టేశారు..

ట్రెండింగ్ వార్తలు