ప్రతీ మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తోంది.. అధికారులపైనా చర్యలుంటాయి : సీఎం చంద్రబాబు నాయుడు

ప్రతీ మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తోంది. రికార్డులుకూడా తారుమారు చేశారు. రీ సర్వే అస్తవ్యస్తంగా జరగటం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని సీఎం చంద్రబాబు అన్నారు.

CM Chandrababu Naidu

CM Chandrababu Naidu : సీఎం చంద్రబాబు నాయుడు శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వెళ్లారు. రాష్ట్రం నలుమూలల నుంచి తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన వారి నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ లో చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వినతులు ఎన్ని ఉన్నా అన్నింటి పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గడిచిన ఐదేళ్ల కాలంలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువగా ఫిర్యాదు వస్తున్నాయని తెలిపారు. రెవెన్యూ సమస్యలకు కారణమైన, అక్రమాలకు పాల్పడిన అధికారులపైనా చర్యలు ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు.

Also Read: విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స ఎంపిక వెనుక జగన్‌ మాస్టర్ ప్లాన్ ఇదే..!

ప్రతీ మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తోంది. రికార్డులుకూడా తారుమారు చేశారు. రీ సర్వే అస్తవ్యస్తంగా జరగటం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతీ జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు స్వీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నాం. రెవెన్యూశాఖను ఎంత దారుణంగా నిర్వీర్యం చేశారో మదనపల్లి ఘటనే ఓ ఉదాహరణ. వచ్చే 100రోజుల్లో దెబ్బతిన్న వ్యవస్థలన్నీ గాడిలో పెడతాం. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తాం. వినతులు ఎక్కువ తీసుకోవటంతోపాటు ఎక్కువ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతీఒక్కరి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని చంద్రబాబు చెప్పారు. వచ్చిన వినతులన్నీ శాఖల వారీగా విభజించి నిర్దిష్ట కాలపరిమితిలోపు వాటి పరిష్కారమయ్యేలా కార్యాచరణ రూపొందించుకున్నాం. ఉద్యోగులుకూడా పెద్ద ఎత్తున సమస్యలతో వస్తున్నారు. కార్యకర్తల సమస్యలు, ప్రజా సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఇలా వేటికివాటికి విభజించి పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.

Also Read : ఏపీలో అక్టోబర్ నుంచి కొత్త లిక్కర్ పాలసీ..! ఆ 6 రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయం

ప్రజలు దూర ప్రయాణాలుచేసి అమరావతి వరకూ రాకుండా జిల్లాల వారిగా మంత్రులు, నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలు వినతులు తీసుకునేలా యంత్రాంగం రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. జిల్లాల్లో నా పర్యటనల సందర్భంగా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా పోలీసు వ్యవస్థలోనూ మార్పులు తెస్తాం. పోలీసు వ్యవస్థ సంయమనం పాటిస్తూ ప్రజా పోలీసింగ్ చేసే వ్యవస్థ గా మారుస్తాం. వర్షాలు పడి ప్రాజెక్టులు కూడా నిండటంతో రైతులు సంతోషం గా ఉన్నారు. శాఖల వారీ సమీక్షలు సత్ఫలితాలనిస్తున్నాయని చంద్రబాబు చెప్పారు.

 

 

ట్రెండింగ్ వార్తలు