Cm Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ.. సీఎం చంద్రబాబు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ

డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. వ్యక్తులు, నేతలు చేసే తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వనని చంద్రబాబు అన్నారు.

  • Updated on- March 15, 2026 / 06:22 PM IST

Representative Image (Image Credit To Original Source)

  • డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ పై ఆరోపణలు
  • సీరియస్ గా తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు
  • పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుట్టాకు ఆదేశాలు
  • వివరణ కోరుతూ పుట్టాకు నోటీసులు

 

Cm Chandrababu: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీకి చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ పై వచ్చిన ఆరోపణలను టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎంపీ మహేశ్ కు పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఘటనపై ఎంపీ పుట్టా మహేశ్ ను వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ను చంద్రబాబు ఆదేశించారు. ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన అంశంపై నివేదిక ఇవ్వాలని పల్లాకు ఆదేశించారు చంద్రబాబు. డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. వ్యక్తులు, నేతలు చేసే తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వనని చంద్రబాబు అన్నారు.

Also Read: మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో కీలక పరిణామం.. టీడీపీ ఎంపీకి స్టేషన్ బెయిల్