Amaravathi: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అమరావతిలో మరో రెండు కొత్త ప్రాజెక్టులు.. చంద్రబాబు కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి(Amaravathi) పునర్నిర్మాణంతో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం చేసింది.

Cm Chandrababu warns illegal protests amaravati project launch

  • శాంతిభద్రతలపై చంద్రబాబు తీవ్ర హెచ్చరిక
  • రెండు ప్రాజెక్టులు ఈనెలే ప్రారంభం
  • వేగంగా సాగుతున్న అమరావతి నిర్మాణం

Amaravathi: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణంతో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం చేసింది. పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూనే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అరాచక శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు, పరిపాలనా యంత్రాంగాన్ని ఆదేశించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల ఇష్టాగోష్టి సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రతిపక్షాల నిరసనలపై నిప్పులు చెరిగిన ఆయన, ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అదే సమయంలో రాబోయే రోజుల్లో ప్రారంభం కానున్న కీలక నీటిపారుదల ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణ పురోగతికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Telangana Government: జీఎస్టీ వ్యవస్థలో కీలక మార్పులు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. పన్ను ఎగవేతదారులకు చెక్

నిరసనల పేరిట అలజడి చేస్తే సహించేది లేదు:

చట్టానికి వ్యతిరేకంగా ఏ చిన్న చర్యకు పాల్పడినా తీవ్ర పరిణామాలు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విపక్ష పార్టీ నిర్వహిస్తున్న నిరసనల్లో అసలైన డీఎస్సీ అభ్యర్థులు ఒక్కరూ లేరని, ప్రతిపక్షాలు చేసే నష్టాన్ని తిప్పికొడుతూ ఉపాధ్యాయ లోకం ఐక్యంగా తమ ఆత్మగౌరవాన్ని చాటుకుందని సీఎం కొనియాడారు. ఇక, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని, ఆర్థిక పరిస్థితిపై దాదాపు 10 గంటల పాటు అధ్యయనం చేసి, ప్రజెంటేషన్ రూపంలో వివరించడం వల్ల ప్రజలకు వాస్తవాలు అర్థమయ్యాయన్నారు. అయినప్పటికీ, ఈ నెలాఖరు నాటికి వెలిగొండ ప్రాజెక్టుతో పాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అనకాపల్లి వరకు సాకారం చేస్తామని, వచ్చే ఏడాది నాటికి విశాఖపట్నానికి నీటిని తీసుకెళ్తామని వెల్లడించారు.

వర్షాకాలంలోనూ వేగంగా అమరావతి పనులు:

రాజధాని అమరావతి (Amaravathi)పనులు వర్షాకాలంలోనూ విరామం లేకుండా సాగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. ఈ నెలలోనే అమరావతికి సంబంధించి రెండు అతిముఖ్యమైన ప్రారంభోత్సవాలు ఉన్నాయని వెల్లడించారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభంతో పాటు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల కోసం నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను అందుబాటులోకి తెస్తామని సీఎం ప్రకటించారు. ప్రజాప్రతినిధులకు వసతి సౌకర్యాలు కల్పిస్తూనే, రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనను మరింత వేగవంతం చేస్తున్నామని స్పష్టం చేశారు.