Andhra pradesh: శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్.. కడప, ప్రకాశం జిల్లాల్లో చంద్రబాబు..

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మరోవైపు కడప, ప్రకాశం జిల్లాల్లో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తారు.

Chandrababu and Jagan

Andhra pradesh: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా ఏపీ మాజీ సీఎం, టీడీపీ నేత చంద్రబాబు నాయుడు కడప, ప్రకాశం జిల్లాల్లో పర్యటిస్తారు.

cm jagan mohan reddy

శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన ..

ఏపీ సీఎం వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. సంతబొమ్మాళి మండలం మూలపేట‌లో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తారు.

♦   ఉదయం 10.15 గంటలకు సీఎం జగన్‌మోహన్ రెడ్డి మూలపేట చేరుకుంటారు.

♦   10.30 – 10.47 గంటల మధ్య మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తారు.

♦   మూలపేట బీచ్‌లో గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాల్లో జగన్ పాల్గొంటారు.

♦   మూలపేట నుండి నౌపాడ హెలికాప్టర్ ద్వారా సీఎం జగన్ చేరుకుంటారు.

♦   ఉదయం 11.35 గంటల‌కు నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్ధాపన చేస్తారు. దీంతోపాటు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ.365 కోట్లతో ఫిషింగ్ హార్బరు, హిరమండలం పరిధిలోని రూ.176 కోట్లతో వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు, రూ.852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ రిజర్వాయర్ ప్రాజెక్టుకు సీఎం భూమి పూజ చేస్తారు.

♦   11.40 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్యలో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో సీఎం ముఖాముఖి కార్యక్రమంతో పాటు భూములు ఇచ్చిన వారికి సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.

 

Chandrababu naidu

కడప, ప్రకాశం జిల్లాల్లో చంద్రబాబు పర్యటన..

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండవ రోజు కడప జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం కడపలో సమీక్షా సమావేశంలో పాల్గొన్న తరువాత చంద్రబాబు బద్వేల్ చేరుకున్నారు. ఈ రోజు బద్వేల్ నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. కడప పర్యటన అనంతరం ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాంగంగా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత గిద్దలూరులో చంద్రబాబు పర్యటిస్తారు. పశ్చిమ ప్రాంత నియోజక వర్గాలైన గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెంలలో 21వతేదీ వరకు అంటే మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈరోజు పర్యటన ఇలా..

♦   మధ్యాహ్నం 2గంటలకు కడప జిల్లా పర్యటన ముగించుకొని రోడ్డు మార్గాన 4:30 గంటలకు గిద్దలూరు గాంధీబొమ్మ సెంటర్ వద్దకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుంటారు.

♦   అక్కడినుండి కోమ్మరం కట్ట, రాచర్ల గేట్ సెంటర్, ఆర్టీసీ డిపో, విన్నూతన విధ్యానికేతన్ వరకు రోడ్డు షోలో పాల్గొంటారు.

♦   6:30 నిమిషాలకు విన్నూతన విద్యానికేతన్ వద్ద ఓపన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు చేరుకుంటారు.

♦   సభా వేదికపై ప్రసంగించిన అనంతరం రాత్రి 8.15 నిమిషాలకు గిద్దలూరునుండి బయలుదేరి కంభం, తర్లుబాడు మీదుగా రోడ్డు మార్గాన 9:45 గంటలకు మార్కాపురం చేరుకుంటారు.

♦   బుధవారం రాత్రి స్థానిక శ్రీ‌సాయి బాలాజీ స్కూల్లో చంద్రబాబు బస చేస్తారు.

♦   20వ తేదీన మార్కాపురంలో చంద్రబాబు పర్యటన సాగుతుంది.

♦   అదేరోజు చంద్రబాబు పుట్టిన రోజు కావడంతో భారీ ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ నాయకులు, శ్రేణులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్కాపురానికి టీడీపీ నాయకులు తరలివచ్చే అవకాశం ఉంది.

 

ట్రెండింగ్ వార్తలు