ఏపీలో పింఛన్ పెరిగేది ఎప్పుడంటే..? అసెంబ్లీలో సీఎం ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ పెరిగేది ఎప్పటి నుంచి అనేదానిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం ముసలివాళ్లకు, వితంతులకు, వికలాంగులకు ఇచ్చే పింఛన్ డబ్బులను రూ. 2500కు పెంచనున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఏపీలో పింఛన్ తీసుకునేవారికి ఇచ్చిన మాట ప్రకారం డబ్బులు పెంచబోతున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. వృద్ధులకు పింఛన్ వయసును 65 నుంచి 60కు తగ్గించామని ఆయన స్పష్టం చేశారు.
మేనిఫెస్టోలో కూడా పింఛన్ పెంచుకుంటూ పోతామని చెప్పామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2,250 పెంచామని.. జులై 8 దివంగత నేత వైఎస్సార్ జన్మదినం రోజున మరో రూ.250 పెంచుతాం.. మొత్తం రూ.2,500 చేస్తామని చెప్పారు. టీడీపీ హయాంలో ఇచ్చింది దాదాపుగా 44 లక్షల మందికి పింఛన్లు మాత్రమేనని, తాము 61 లక్షల మందికి ఇస్తున్నట్లు వెల్లడించారు.
కాగా.. ముఖ్యమంత్రిగా జగన్ తన ప్రమాణస్వీకారం సమయంలో తొలి సంతకం చేసిన తర్వాత నుంచి పింఛన్లు 2250 వస్తుండగా.. 2021 జులై నుంచి 2500 రాబోతున్నాయి. ఇక సీఎం జగన్.. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూరక్వంగా సభను తప్పుదారి పటిస్తున్నారని, పదే పదే అబద్దాలు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.