ఉప ముఖ్యమంత్రి కూతురికి సీఎం జగన్, వైఎస్ భారతిల పేర్లు

ఉప ముఖ్యమంత్రి కూతురికి సీఎం జగన్, వైఎస్ భారతిల పేర్లు

Updated On : February 28, 2021 / 8:56 AM IST

AP Deputy CM: వైఎస్ కుటుంబంపై అభిమానాన్ని కొత్తగా చాటుకుంది ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి. వైఎస్సార్సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, ఉప ముఖ్యమంత్రి పుష్ప దంపతుల తొలి సంతానంగా పాప పుట్టింది.

ఆమెకు పేరు పెట్టే పనిలో భాగంగా.. సీఎం జగన్, భారతి పేర్లు, వైఎస్ అక్షరాలు కలిసొచ్చేలా ‘యశ్విత శ్రీజగతి’ అని నామకరణం చేశారు. విజయనగరం జిల్లా చినమేరంగిలోని స్వగృహంలో శనివారం నిర్వహించిన నామకరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన, మంత్రి బొత్స తదితరులు హాజరయ్యారు.

యశ్వితలో మొదటి అక్షరం వై, శ్రీలో మొదటి అక్షరం ఎస్‌ కలిపితే వైఎస్‌ అని, తమ నాయకుడు జగన్, ఆయన సతీమణి భారతి పేరు కలిపి జగతి అని నామకరణం చేశామని పుష్పశ్రీవాణి దంపతులు సగర్వంగా చెప్పుకున్నారు.