CM Jagan Sankranti : సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ దంపతులు

మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి అని జగన్ అన్నారు.

CM Jagan Sankranti : తెలుగు వారి ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. తెలుగు వాళ్లు ఎంతో ఘనంగా సంక్రాంతి జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి కోలాహలం నెలకొంది. ఇవాళ భోగి సందర్భంగా ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలోని గోశాల దగ్గర వేడుకలు నిర్వహించారు.

Omicron – Cyber attack: బీ కేర్ ఫుల్.. ఒమిక్రాన్‌నూ వదలని సైబర్ చీటర్లు.. క్లిక్ చేస్తే మొత్తం దోచేస్తారు..!

ఈ సంబరాలకు సీఎం జగన్ దంపతులు హాజరయ్యారు. సీఎం జగన్ సంప్రదాయ పంచె కట్టుతో కనిపించారు. గ్రామాల్లో సంక్రాంతి సందర్భంగా ఎలాంటి సంబరాలు కనిపిస్తాయో అన్నింటిని తాడేపల్లిలోని సీఎం నివాసంలో నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

భోగి మంటలు, హరిదాసులు, గంగిరెద్దులు, గోమాతలకు పూజలు, సంక్రాంతి నృత్యాలు, డప్పు మోతలు, కోలాటాలు, పిండివంటలు… ఇలా సీఎం నివాసంలో సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. ఈ వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Bad Cholesterol : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే?

ఈ వేడుకలను ఆస్వాదించిన సీఎం జగన్.. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి అని జగన్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు