Cm Jagan Prc
CM Jagan PRC : ఏపీలో పీఆర్సీ వివాదం పీక్ స్థాయికి చేరుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ఏకంగా సమ్మె నోటీసు ఇవ్వడానికి రెడీ అయ్యాయి. అంతేగాకుండా…ఉద్యమ కార్యాచరణను సైతం ప్రకటించాయి. అయితే..కేబినెట్ భేటీ అనంతరం సీఎం జగన్..స్వయంగా మంత్రులు, కొంతమంది అధికారులతో విడిగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read More : High Vitamin D : శరీరంలో విటమిన్ డి అధికమైతే కొత్తసమస్యలు
పీఆర్సీ ప్రకటించిన అనంతరం జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. ప్రతిపక్షాలు పక్కదారి పట్టించేలా, కొన్ని సంఘాలు సైతం తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నాయని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పీఆర్సీ వాస్తవ పరిస్థితులను వారికి వివరించారు. ఉద్యోగులకు మేలు చేకూరుస్తుందని తెలిపారు. వీటన్నింటినీ ఉద్యోగులకు వివరించాలని మంత్రులకు ఆయన సూచించారు. వాస్తవ వివరాలు ఏంటో వారి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈ సందర్భంగా సంపూర్ణ సమాచారంతో ఉన్న నోట్ లు మంత్రులకు పంపిణీ చేశారు.
Read More : Oxygen Levels : శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచే ఆహారం ఇదే!
గత కొన్ని రోజులుగా పీఆర్సీ అంశం రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పీఆర్సీతో జీతం పెరుగుతుందని అబద్ధం చెబుతున్నారని, మూడు జీవోలను బేషరతుగా రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఉద్యోగికి రూ. 6 వేల నుంచి రూ. 7 వేల వరకు ఉద్యోగి జేబుకు చిల్లు పడే పరిస్థితి ఉందంటున్నారు. ఈ క్రమంలో..పీఆర్సీ జీవోలకు కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో సమ్మెలోకి వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు సీఎస్ కు వినతిపత్రం ఇవ్వాలని, ఫిబ్రవరి 07 లేదా 08వ తేదీ నుంచి సమ్మె చేపట్టాలని తాజాగా నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ప్రభుత్వం వారికి బుజ్జగించేందు ఓ కమిటీ వేసింది. ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో…బొత్స సత్యనారాయణ, బుగ్గన, పేర్ని నాని, సజ్జల, సీఎస్ లు ఉండనున్నారు.