మత్స్యకారులకు రూ.10వేలు సాయం, సీఎం జగన్ మరో వరం

లాక్ డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. కష్టకాలంలో రూ.10వేలు ఆర్థిక సాయం అందించనుంది.

  • Publish Date - April 17, 2020 / 05:09 AM IST

లాక్ డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. కష్టకాలంలో రూ.10వేలు ఆర్థిక సాయం అందించనుంది.

లాక్ డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. కష్టకాలంలో రూ.10వేలు ఆర్థిక సాయం అందించనుంది. లాక్‌డౌన్, చేపల వేటపై నిషేధం వల్ల దాదాపు మూడు నెలలపాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 20 రోజుల్లో వేట విరామ సాయం అందించేందుకు లబ్ధిదారుల గుర్తింపు ప్రారంభమైంది. లబ్దిదారుల కుటుంబాలకు రూ.10వేల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్షేత్రస్థాయి సిబ్బంది, ప్రస్తుతం పడవలపై పని చేస్తున్న కార్మికుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. వేట విరామ సాయం లబ్దిదారుల ఎంపికకు మార్గదర్శకాలను విడుదల చేసింది. 

వైసీపీ అధికారంలోకి రాగానే వీరికి అందచేసే సాయాన్ని రూ.10 వేలకు పెంచింది. 2019 నవంబరు 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా 1,02,338 మందికి వేట విరామ సాయాన్ని అందించింది. బోట్ల సంఖ్య పెరగడంతో ఈ ఏడాది లబ్దిదారుల సంఖ్య పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

* మార్చి 31 లోపు మరపడవలను నిర్వాహకులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 
* మరపడవలపై 8 మంది, మోటారు పడవలపై ఆరుగురు, సంప్రదాయ పడవలపై ముగ్గురు కార్మికులకు వేట విరామ సాయం అందించనుంది. 
* గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల్లోని మత్స్యశాఖ సహాయకులు, ఇతర సిబ్బంది పడవలపై పనిచేస్తున్న కార్మికుల జాబితా సేకరించి అర్హుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. 
* లబ్దిదారుల జాబితా ఖరారు అయిన తరువాత వారి బ్యాంకు ఖాతాల్లో వేట విరామ సాయాన్ని ప్రభుత్వం జమ చేయనుంది.
* ఈ ఏడాది వేట విరామ సమయం ప్రాంభమైన 20 రోజుల్లోనే ప్రభుత్వం సాయం అందజేస్తుందని మత్స్యశాఖ మంత్రి మోపిదేవి చెప్పారు.