కోవిడ్ లక్షణాలు వున్న వారిని, అనుమానిత లక్షణాలు వున్నవారిని కోవిడ్ ఆస్పతుల్లో చేర్చడం కష్టం కాబట్టి కోవిడ్ కేర్ సెంటర్లలో వారిని వుంచి, ఎప్పటికప్పుడు వారిని పరిశీలించడం, ఎవరికైనా లక్షణాలు బయటపడి అస్వస్తతకు గురయ్యే పరిస్థితి వుంటే, వెంటనే వారిని సమీపంలోని కోవిడ్ ఆస్పతికి తీసుకువెళ్ళేందుకు వీలుగా అన్ని ఏర్పాటు చేసినట్లు కృష్ణబాబు తెలిపారు. అందుకే కోవిడ్ ఆస్పతికి కనీసం 15 నిమిషాల ప్రయాణ దూరంలోనే కోవిడ్ కేర్ సెంటర్లు, క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తన్నామని తెలిపారు. కోవిడ్ టాస్క్‌ఫోర్స్ చైర్మన్, రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 76 కోవిడ్ కోవిడ్ సెంటర్లలో మొత్తం 45240 బెడ్ లను సిద్ధం చేయడం జరిగిందని కృష్ణబాబు తెలిపారు.
రాష్ట్రంలోని మొత్తం 74 కోవిడ్ హాస్పటల్స్ లో 5874 మంది చికిత్స పొందుతున్నారని, 9421 మంది అనుమానితులు 116 క్వారంటైన్ సెంటర్లలో వున్నారని తెలిపారు. క్వాంరంటైన్, కోవిడ్ కేర్ సెంటర్లలో మంచినీరు, ఆహారం, శానిటేషన్, వైద్యబృందాలు అందించే సేవలు, అంబులెన్స్‌లు తదితర అన్ని సదుపాయాల విషయంలో ఎటువంటి ఉదాసీనత ప్రదర్శించినా సహించేది లేదని స్పష్టం చేశారు.