ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా కరోనా కట్టడిని బాగా సీరియస్ గా తీసుకుంది. సరిహద్ధులు దాటి ఎవరూ రాకూడదని విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రజలైనాసరే ఎక్కడివారు అక్కడు ఉండాల్సిందే తప్ప… లాక్ డౌన్ కట్టుబాటు తప్పకూడదని అంటున్నారు. ఇప్పుడు గ్రామాల్లో కరోనా తీవ్రత నియంత్రణలోనే ఉంది. వాలంటీర్ వ్యవస్థతో నిఘావేసింది. ఇప్పుడు పెద్ద సమస్య నగరాలు, పట్టణాలు. విదేశాల నుంచి వచ్చినవారు ఎక్కువమంది నగరాల్లోనే ఉన్నారు. అందుకే టార్గెట్ టౌన్ అంటోంది జగన్ ప్రభుత్వం. మొత్తం పట్టణాలు, నగరాలకే జల్లెడ పట్టేసి, విదేశాల నుంచి వచ్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టకూడదని అనుకొంటోంది.
అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు రాసిన లేఖలో కేబినేట్ సెక్రటరీ Rajiv Gauba… హెచ్చరిక లాంటి సూచన చేశారు. జనవరి 18 నుంచి మార్చి 23వరకు రాష్ట్రాల్లోకి విదేశాల నుంచి వచ్చిన వాళ్ల మీద నిఘాలో చాలా గ్యాప్ కనిపిస్తోంది. అసలు ఎంతవమంది వచ్చారు? వాళ్లలో ఎంతమందిని మనం టెస్ట్ చేశామో మరోసారి సరిచూసుకోవాలని చెప్పారు. ఆయన దేశంలోనే అత్యున్నత అధికారి. ఆయన లేక రాయగానే, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిక ప్రాంతాల్లో అలజడి. అందరూ విదేశాల నుంచి వచ్చినవారి పూర్తి లేక్కలు తీయడం మొదలుపెట్టారు. నిజానికి విదేశాల నుంచి వచ్చినవారు, టెస్ట్ చేసిన వాళ్ల మధ్య చాలా తేడా ఉంది. అంటే… నిఘా నుంచి తప్పించుకుపోయిన వాళ్లలో కొందరైనా
కరోనా బాధితులుండొచ్చు.
Home Ministry’s Bureau of Immigration లెక్క ప్రకారం15 లక్షలకుమించిన విదేశీ ప్రయాణీకులు దేశంలోకి వచ్చారు…వాళ్లవాళ్ల రాష్ట్రాలకెళ్లారు. వీళ్లంతా ఇంటర్నేషన్ ఫ్లైయట్స్ లో వచ్చినవాళ్లు. పోర్టులు, దేశాల సరిహద్ధుల నుంచి వచ్చినవారు మరికొంతమంది. వీళ్లను కనిపెట్టడం కేంద్రం వల్ల కావడంలేదు. బీహార్ లో Muzaffarpur,Saran జిల్లాలకు 500 మంది వచ్చారు. వాళ్లలో 385 మందినే అధికారులు గుర్తించగలిగారు. మిగిలిన వాళ్లు ఎక్కడున్నారో తెలియదు. జిల్లా అధికారులు మాత్రం కేంద్రమే సరైన సమాచారం ఇవ్వలేదని, మొత్తంమీద 30 మంది ఆచూకీ మాత్రమే తెలియడంలేదని అంటున్నారు.
అందుకే జగన్ త్వరపడుతున్నారు. విదేశాల నుంచి వచ్చినవారినకి ట్రాక్ చేసి, నిర్భందించి, ట్రీట్ చేయాలని వైద్య బృందాలను పరిగెత్తిస్తున్నారు. ప్రతి పదిమందికి ఒక డార్టర్ ను నియమించారు. 29,264 మంది రాష్ట్రానికి వచ్చారు. అందులో 29,115 మంది ఇళ్లల్లోనే నిర్బంధంలో ఉన్నారు. మిగిలిన 149 మంది ఆసుపత్రి క్వారంటైనీలో ఉన్నారు. ఏపీలో ఇప్పటిదాకా 428 మంది కరోనా అనుమానితులున్నారు. వీళ్లను టెస్ట్ చేస్తే 378 కేసులు నెగిటీవ్. 13 మాత్రమే పాజిటీవ్. ఇంకా 37 కేసుల్లో రిపోర్ట్స్ రావాల్సి ఉంది. 13 మంది పాజిటీవ్ కేసుల్లో 12 కేసులు… అర్బన్ లోనే నమోదైయ్యాయి.
నగరాలు, పట్టణాల్లో వ్యాప్తి ఎక్కువ ఉంటోంది. అందుకే జగన్ ప్రభుత్వం త్వరపడుతోంది. నగరాలు, పట్టణాల్లో వ్యాప్తి ఎక్కువ కాబట్టి… వాటినే టార్గెట్ చేసింది. ఒక్కరినీ వదలిపెట్టకుండా… మొత్తం అందరికీ సర్వేచేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని, కరోనా లక్షణాలున్నా అందరినీ సర్వేచేస్తున్నారు. బాధితులను కనిపెట్టి, ట్రాక్ చేసి, ట్రీట్ చేయాలన్నది జగన్ మూడెంచల వ్యూహం. వైద్య బందాలు, వాలటీర్లకు రక్షణ పరికరాలను ఇవ్వబోతున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం 200 వెంటిలేటర్స్‌కు ఆర్డర్ ఇచ్చారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి పదిమందికి డాక్టర్ ను నియమించారు.