స్వయంగా ఇంటికెళ్లి పింగళి వెంకయ్య కుటుంబాన్ని సన్మానించిన సీఎం జగన్

జాతీయ పతాకాన్ని రూపొందించి వందేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా జాతీయ పతాకం రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబాన్ని సీఎం జగన్‌ కలిశారు. గుంటూరు జిల్లా మాచర్లలో పింగళి కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి ఇంటికి వెళ్లిన సీఎం జగన్ ఆమెను సన్మానించారు. ముఖ్యమంత్రి స్వయంగా తమ ఇంటికి రావడంతో సీతామహలక్ష్మి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

cm jagan honored pingali venkayya family members: జాతీయ పతాకాన్ని రూపొందించి వందేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా జాతీయ పతాకం రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబాన్ని సీఎం జగన్‌ కలిశారు. గుంటూరు జిల్లా మాచర్లలో పింగళి కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి ఇంటికి వెళ్లిన సీఎం జగన్ ఆమెను సన్మానించారు. ముఖ్యమంత్రి స్వయంగా తమ ఇంటికి రావడంతో సీతామహలక్ష్మి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

సీఎం జగన్‌.. పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పింగళి కూతురు స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని సీఎం జగన్‌తో పంచుకున్నారు. అనంతరం పింగళి జీవిత విశేషాలతో కూడిన చిత్రాలను తిలకించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ పేరిట కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబసభ్యులకు సన్మానంతో రాష్ట్రంలో ఈ వేడుకలను సీఎం జగన్‌ ప్రారంభించారు.

ట్రెండింగ్ వార్తలు