CM Jagan : అసెంబ్లీకి రావొద్దు.. మంత్రులు, ఎమ్మెల్యేలకు జగన్ ఆదేశాలు

వరద తగ్గడం లేదు. వర్షాలు ఆగడం లేదు. ఏపీలోని నాలుగు జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ అతలాకుతలమైంది. కుండపోత వానలు, వరదలు విలయం సృష్టించాయి. ముఖ్యంగా..

Cm Jagan Floods

CM Jagan : వరద తగ్గడం లేదు. వర్షాలు ఆగడం లేదు. ఏపీలోని నాలుగు జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ అతలాకుతలమైంది. కుండపోత వానలు, వరదలు విలయం సృష్టించాయి. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో వందలాది గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకోగా.. వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత జిల్లాల్లోని మంత్రులు, ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.

వరద పరిస్థితులపై ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు జగన్. పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఇంఛార్జ్‌ మంత్రులు, ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించాలని ఆదేశించారు సీఎం జగన్‌.

Instant Covid Test : కాఫీతో కోవిడ్‌ టెస్ట్‌ చేయొచ్చు… ఇదిగో ప్రాసెస్..!

గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు తక్షణ సాయం అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వరద బాధితులకు అండగా నిలవాలని మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు.

పట్టణాల్లో పారిశుద్ధ్య పనుల, డ్రైనేజీల పూడికతీత పనులతో పాటు, వరద ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సదుపాయాలు కల్పించాలని జగన్ చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ సరుకుల పంపిణీ జరిగేటట్లు చూడాలన్నారు. బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, కిలో వంట నూనె, కిలో బంగాళదుంపలు, కిలో ఉల్లిపాయలు అందజేయాలని చెప్పారు.

Yawns : ఆవలింతలు అదే పనిగా వస్తున్నాయా…ఆలోచించాల్సిందే?…

జరిగిన నష్టంపై అంచనాలు, పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులు తిరిగి పంటలు సాగు చేసేలా విత్తనాలు వంటివి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడికక్కడ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు తోడుగా నిలవాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని జగన్ తెలిపారు. తమ ప్రాంతంలోనే ఉండి సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు.