Yawns : ఆవలింతలు అదేపనిగా వస్తున్నాయా…ఆలోచించాల్సిందే?…

అదేపనిగా ఆవలింతలు వస్తూ ఉండే శ్వాస సరిగా అందటం లేదని అర్ధం చేసుకోవాలి. ఆవలించినప్పుడు ఊపిరితిత్తుల్లో కణాజాలాలు బాగా సాగుతాయి. తద్వారా ఊపిరి తిత్తుల సైజు పెరుగుతుంది.

Yawns : ఆవలింతలు అదేపనిగా వస్తున్నాయా…ఆలోచించాల్సిందే?…

Yawn (1)

Yawns : ఏ వ్యక్తికైనా ఆవలింపులు రావడం సర్వసాధారణమే. సాధారణంగా ఒక వ్యక్తి ఎంతో అలసిపోయినప్పుడు, తన శరీరానికి విశ్రాంతి కావాలనే సంకేతాన్ని ఆవలింపు రూపంలో మనిషికి తెలియజేస్తుంది. ఆవలింతలు రావడాన్ని చాలా కీలకమైన అంశంగా పరిగణించాలని డాక్టర్లు చెబుతున్నారు. నిద్రపోతున్న సమయంలో కూడా ఆవలింపులు వస్తే అది తీవ్రమైన అనారోగ్య సమస్యలకు సంకేతం అని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది ఆవలింతలు రావడాన్ని తేలిగ్గా తీసుకుంటారు. తరచూ ఆవలింపు ఎక్కువగా వస్తే గుండె సమస్యల బారిన పడతారని నిపుణులు తెలియజేస్తున్నారు.

ప్రతి 10 నిమిషాలకు ఒకటి చొప్పున ఆవలింత వస్తూ ఉంటే… వారు వెంటనే అప్రమత్తం అవ్వాలి. ఇక్కడ కరెక్టుగా 10 నిమిషాలే అని లేదు. కొంత మందికి పావుగంటకు ఒకటి రావచ్చు… కొంత మందికి ఐదు నిమిషాలకు ఒకటి రావచ్చు. కానీ ఇలా కంటిన్యూగా వచ్చే వారు వెంటనే వైద్యుడిని సంప్రదించటం మంచిది. మెదడులో ఉష్ణోగ్రత పెరిగినప్పుడూ… మెదడుకి సరిగా ఆక్సిజన్ అందనప్పుడు కంటిన్యూగా ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఆక్సిజన్ కోసం మెదడు… ఆవలింతలను రప్పిస్తుంది. తద్వారా ఎక్కువ ఆక్సిజన్ మెదడుకు అందుతుంది.

అదేపనిగా ఆవలింతలు వస్తూ ఉండే శ్వాస సరిగా అందటం లేదని అర్ధం చేసుకోవాలి. ఆవలించినప్పుడు ఊపిరితిత్తుల్లో కణాజాలాలు బాగా సాగుతాయి. తద్వారా ఊపిరి తిత్తుల సైజు పెరుగుతుంది. ఆ తర్వాత నుంచి వాటిలోకి ఎక్కువ గాలి వచ్చేందుకు వీలవుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ సమస్య గుండెపోటుకు దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఒక వ్యక్తికి గుండె సమస్యలు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వారి ఆహార విషయంలో కానీ, అధిక శరీర బరువు పెరగడం వల్ల, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా తరచూ చాతిలో నొప్పి రావడం సర్వసాధారణం. అయితే ఈ లక్షణాలలో ఆవలింపు కూడా ఒకటని చెప్తున్నారు. ఒక వ్యక్తికి ఎక్కువగా ఆవులింతలు వస్తున్నాయంటే అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మన శరీరంలో మెదడు నుంచి ఉదయం వరకు వేగస్ నాడి ఉంటుంది. మనం తరచూ ఆవలించడం వల్ల ఆ ప్రభావం వేగస్ నాడీ పై పడుతుంది.ఆ సమయంలో గుండె చుట్టూ రక్తప్రవాహం అధికంగా ఉంటే ఛాతిలో నొప్పి కలిగి హార్ట్ స్ట్రోక్ రావడానికి ఆవులింత కారణమవుతుంది. అలాంటి సందర్భంలో గుండెసంబంధిత వైద్యనిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవటం బెటర్.