Moto G06 Power : కొత్త మోటో G06 పవర్‌పై బిగ్ డిస్కౌంట్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Moto G06 Power : మోటోరోలా G06 పవర్ ఫోన్ ధర తగ్గిందోచ్.. ఫీచర్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో కేవలం రూ. 5వేలకే కొనేసుకోవచ్చు.

Moto G06 Power : కొత్త మోటోరోలా ఫోన్ కొంటున్నారా? మీకో గుడ్ న్యూస్.. మోటోరోలా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ మోటో G06 పవర్ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి సేల్ సందర్భంగా ఈ మోటో జీ06 పవర్ సరసమైన ధరకే కొనేసుకోవచ్చు. భారీ 7,000mAh బ్యాటరీతో పాటు పవర్‌ఫుల్ ఎంట్రీ-లెవల్ ఫోన్ అత్యంత చౌకైన ధరకే లభిస్తోంది. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ మోటో G06 పవర్ బేస్ మోడల్ ప్రస్తుతం కేవలం రూ.7,499కి అందుబాటులో ఉంది. ఈ పండగ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మోటో G06 పవర్‌పై బిగ్ డిస్కౌంట్ : ఈ మోటో G06 ఫోన్ కొనుగోలుపై బ్యాంక్ డిస్కౌంట్లతో మరింత తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్లతో అదనంగా రూ. 300 సేవ్ చేసుకోవచ్చు. తద్వారా మోటో G06 పవర్ ప్రారంభ ధర రూ. 7,199కి తగ్గుతుంది. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ. 5,450 వరకు తగ్గింపు పొందవచ్చు.

ఒకవేళ మీ పాత ఫోన్ రూ. 2,100 తగ్గింపు లభిస్తే.. ఈ మోటోరోలా ఫోన్ రూ. 5వేలకు సొంతం చేసుకోవచ్చు. అయితే, ఫైనల్ ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది పూర్తిగా మీ పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

మోటో G06 పవర్ కీలక ఫీచర్లు : ఫీచర్ : స్పెసిఫికేషన్ డిస్‌ప్లే : 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.88-అంగుళాల HD+ డిస్‌ప్లే ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో G81 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్ ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 15 ఆధారిత హీలియో యూఐ

స్టోరేజీ : 4GB ర్యామ్ + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ (మైక్రో SD ద్వారా 1TB వరకు ) బ్యాటరీ : 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పవర్‌ఫుల్ 7,000mAh బ్యాటరీ కెమెరా : 50MP ప్రైమరీ బ్యాక్ కెమెరా, 8MP సెకండరీ కెమెరా కనెక్టివిటీ : 4G, LTE, Wi-Fi, బ్లూటూత్ సపోర్టు

మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లపై దీపావళి డీల్స్ : ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్‌తో పాటు మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లోని అన్ని ఫోన్లపై బ్యాంక్ ఆఫర్లతో తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.