Free gold : ఆహా.. బంపర్ ఆఫర్.. బంగారం ఫ్రీగా ఇచ్చేస్తున్నారు.. గోల్డ్ వ్యాపారుల కొత్త ప్లాన్..

Free gold on Dhanteras : బంగారం ధర పెరుగుతున్నా ధన్‌తేరస్, దీపావళికి బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి ధర ఎక్కువగా ఉండడంతో..

Free gold : ఆహా.. బంపర్ ఆఫర్.. బంగారం ఫ్రీగా ఇచ్చేస్తున్నారు.. గోల్డ్ వ్యాపారుల కొత్త ప్లాన్..

Free gold

Updated On : October 18, 2025 / 1:53 PM IST

Free gold on Dhanteras : బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. పది గ్రాముల 24 క్యారట్ల బంగారం రూ. 1.30లక్షలకు చేరగా.. 22 క్యాటరట్ల బంగారం రూ.1.20 లక్షల వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గోల్డ్ రేటు వేగంగా పెరుగుతూ సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది.

బంగారం ధర రోజురోజుకు పెరుగుతుండటంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత నెలలో దసరా పండుగ సందర్భంగా గోల్డ్ కొనుగోలు చేసేందుకు ఆయా వర్గాల ప్రజలు సాహసం చేయలేక పోయారు. ప్రస్తుతం ధన్ తేరస్, దీపావళి పర్వదినాల్లోనూ గోల్డ్ కొనుగోలు చేద్దామంటే ధరలు భారీగా పెరిగాయి. దీంతో కొద్దిమంది మాత్రమే గోల్డ్ కొనుగోలు చేసేందుకు సాహసం చేస్తున్నారు.

గోల్డ్ రేటు ఎంతఉన్నా ధన్‌తేరస్ నాడు, దీపావళికి బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే, ఈసారి ధర ఎక్కువగా ఉండడంతో కొనుగోలుదారులు వెనుకంజ వేస్తున్నారు. అయితే, ప్రజలను ఆకట్టుకొని తమ సేల్స్ పెంచుకునేందుకు బంగారం వ్యాపారులు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. ఇదే క్రమంలో పలు ఆఫర్లు ప్రకటిస్తున్నారు.

Also Read: Gold Rate Today : ధన్ తేరరాస్ రోజు గుడ్ న్యూస్.. బంగారం, వెండి రేట్లు డౌన్.. రూ.17వేలు తగ్గింది.. పండుగ చేసుకోండి..

క్యారట్‌లేస్ మేనేజింగ్ డైరెక్టర్ సౌమెన్ భౌమిక్ మాట్లాడుతూ.. ప్రజలు బంగారాన్ని కొనుగోళ్లు చేయడం వాయిదా వేయడం లేదు.. వారు తెలివిగా ప్రణాళికలు వేస్తున్నారు. అదే సమయంలో వ్యాపారులుసైతం వారికి అనుగుణంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ, ఆర్థికపరంగా కొనుగోలుదారులకు తేలికపర్చేలా డిజైన్లు తయారు చేయడం వంటివాటిపై దృష్టి పెడుతున్నారు. క్యారట్‌లెస్ ప్రతి రూ. 35,000 కొనుగోళ్లకు ఉచితంగా 0.5 గ్రాముల బంగారు నాణెం ఆఫర్ చేసింది. ఈ ప్రక్రియ కొనుగోలుదారులను ఆకర్షించి సేల్స్ పెంచుతుంది. కంపెనీ అమ్మకాలను పెంచడానికి తెలివైన పనిగా ఉంటుంది.

భారీగా పెరిగిన గోల్డ్ రేటు తేలికైన, ప్రత్యామ్నాయ స్వచ్ఛత ఆభరణాల వైపు ప్రజలను వేగవంతంగా దృష్టిసారించేలా చేస్తుంది. 9క్యారట్ల బంగారం (37.5శాతం స్వచ్చమైన బంగారం) కోసం బీఐఎస్ సర్టిఫికేట్ తప్పనిసరి చేయడంతో వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొని 9క్యారట్ల గోల్డ్ పై దృష్టిసారిస్తున్నారని సౌమెన్ భౌమిక్ తెలిపారు. క్యారట్‌లేన్ యొక్క 9 క్యారట్ల బంగారం ఇప్పుడు రూ.7,500 నుండి ప్రారంభమవుతుంది.. ఇందులో 200 కంటే ఎక్కువ BIS-సర్టిఫైడ్ డిజైన్‌లు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లకు బహుమతులు కూడా ఆఫర్ చేస్తున్నామని తెలిపారు.

కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరుగుతున్న వేళ.. 18క్యారట్ల బంగారంలో పలు రకాల డిజైన్ల కోసం యువతులు, మహిళలు ఆసక్తిని కనబర్చుతుండటం చూస్తున్నామని అన్నారు. మలబార్ గోల్డ్ & డైమండ్స్ చైర్మన్ MP అహ్మద్ మాట్లాడుతూ.. బంగారం కొనుగోలు చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ ప్రజలు తమ బడ్జెట్ కు అనుగుణంగా ఉండే డిజైన్లు, ఆఫర్లు ఇచ్చే దుకాణాల్లో కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా యువత తేలికైన, వారి జీవనశైలికి తగిన విధంగా ఉండే ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నారని అన్నారు. మలబార్ గోల్డ్ అన్‌కట్, రత్నాల ఆభరణాల తయారీ ఛార్జీలపై 30శాతం వరకు తగ్గిపు, వజ్రాల విలువపై 30శాతం వరకు తగ్గింపుతో సహా అనేక ఆఫర్లను అందిస్తుంది. ధన్ తేరాస్ కొనుగోళ్లను ముందస్తుగా 10శాతం చెల్లించి బుక్ చేసుకునే కస్టమర్లకు బంగారం ధరను బట్టి ఉచితంగా వెండి నాణెం అందిస్తున్నారు. ఇలా బంగారం భారీగా పెరుగుతున్న వేళ గోల్డ్ షాపుల యాజమాన్యాలు సరికొత్త ఆఫర్లు పెడుతూ.. కొంతమొత్తంలో బంగారాన్ని ఉచితంగా అందిస్తున్నారు.