Gold Rate Today : ధన్ తేరరాస్ రోజు గుడ్ న్యూస్.. బంగారం, వెండి రేట్లు డౌన్.. రూ.17వేలు తగ్గింది.. పండుగ చేసుకోండి..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరల్లో

Gold Rate Today
Gold Rate Today : ధంతేరాస్, దీపావళి పండుగ వేళ బంగారం, వెండి కొనుగోలు దారులకు భారీ శుభవార్త వచ్చింది. కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు శనివారం ఒక్కసారిగా పడిపోయాయి. ఇటీవల కాలంలో ఎప్పుడూ తగ్గనంత స్థాయిలో గోల్డ్, సిల్వర్ ధరలు ఇవాళ తగ్గాయి.
ఇవాళ (శనివారం) ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 24 క్యారట్ల బంగారంపై రూ.1,910తగగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.1,750 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 40 డాలర్లు తగ్గింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ 4,249 డాలర్ల వద్ద కొనసాగుతుంది.
మరోవైపు వెండి రేటు కూడా భారీగా తగ్గింది. కిలో వెండిపై ఏకంగా రూ.13వేలు తగ్గింది. దీంతో గడిచిన మూడు రోజుల్లో కిలో వెండిపై రూ.17వేలు తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. గోల్డ్ రేటు భారీగా తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,19,950కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,30,860కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,20,100 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,31,010కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,19,950కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,30,860కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర తగ్గింది.. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,90,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,72,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,90,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.