OnePlus 15R Launch : గెట్ రెడీ.. కొత్త వన్‌ప్లస్ 15R వచ్చేస్తోందోచ్.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

OnePlus 15R Launch : వన్‌ప్లస్ 15R అతి త్వరలో లాంచ్ కాబోతుంది. అంతకన్నా ముందే కీలక ఫీచర్లు, లాంచ్ టైమ్‌లైన్, ధర వివరాలపై అంచనాలివే..

OnePlus 15R Launch : గెట్ రెడీ.. కొత్త వన్‌ప్లస్ 15R వచ్చేస్తోందోచ్.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

OnePlus 15R India Launch

Updated On : October 17, 2025 / 8:38 PM IST

OnePlus 15R Launch : కొత్త వన్‌ప్లస్ 15R ఫోన్ వచ్చేస్తోంది. ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో వన్‌ప్లస్ 15 సిరీస్ లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది. వన్‌ప్లస్ 15, వన్‌ప్లస్ 15R రెండు ఫోన్లు రిలీజ్ కానున్నాయి. చైనాలో వన్‌ప్లస్ ఏస్ 6గా లాంచ్ కానున్నాయి. ఈ నెల చివరిలో చైనాలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. లాంచ్‌కు ముందు బ్రాండ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను టీజ్ చేసింది.

కొత్త డిజైన్, ప్రీమియం బిల్డ్, పవర్‌ఫుల్ హార్డ్‌వేర్‌ (OnePlus 15R Launch) కలిగి ఉండొచ్చు. వన్‌ప్లస్ 15R ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ పర్ఫార్మెన్స్ సరసమైన ప్యాకేజీలోకి అందించే అవకాశం ఉంది. ఈ వన్‌ప్లస్ మల్టీ కలర్ ఆప్షన్లలో క్వాల్‌కామ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ చిప్, భారీ బ్యాటరీ, సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తోంది. రాబోయే వన్‌ప్లస్ 15R ఫోన్ ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

Read Also : Samsung Galaxy Z Flip 6 : వారెవ్వా.. ఖతర్నాక్ డీల్.. ఈ శాంసంగ్ మడతబెట్టే ఫోన్ సగం ధరకే ఇలా కొనేసుకోవచ్చు.. డోంట్ మిస్!

వన్‌ప్లస్ 15R డిజైన్, కలర్ ఆప్షన్లు :
వన్‌ప్లస్ 15R ఫోన్ వైట్, బ్రైట్ బ్లూ కలర్ ఆప్షన్లతో పాటు ఆకర్షణీయమైన సిల్వర్ ఎండ్ కలిగి ఉంటుంది. బ్యాక్ ప్యానెల్‌లో వన్‌ప్లస్ 15 మాదిరిగానే డిజైన్, డ్యూయల్-కెమెరా సెటప్ కలిగి ఉంది. అయితే వన్‌ప్లస్ 15R ఫ్లాగ్‌షిప్ ట్రిపుల్-కెమెరా లేఅవుట్‌ కాకుండా రెండు-లెన్స్ మాడ్యూల్‌తో రావొచ్చు. నివేదికల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రీమియం డిటెయిలింగ్‌ మెటల్ ఫ్రేమ్, మూడు టాప్-ఎడ్జ్ కటౌట్‌లు ఉండవచ్చు. మైక్రోఫోన్‌ల కోసం లేదా ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉండవచ్చు.

వన్‌ప్లస్ 15R స్పెసిఫికేషన్లు (అంచనా) :
వన్‌ప్లస్ 15R ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K BOE ఓఎల్ఈడీ డిస్‌ప్లే, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ కలిగి ఉండొచ్చు. హుడ్ కింద, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుందని భావిస్తున్నారు. 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 7,800mAh సెల్‌తో బ్యాటరీ లైఫ్ భారీగా తగ్గింది. కెమెరా వారీగా అప్‌గ్రేడ్ ట్రిపుల్-లెన్స్ సిస్టమ్ ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ వన్‌ప్లస్ ఫోన్ IP68/IP69 రేటింగ్‌లతో కూడా రానుంది.

వన్‌ప్లస్ 15R ధర, భారత్ లాంచ్ టైమ్‌లైన్ (అంచనా) :
భారత మార్కెట్లో వన్‌ప్లస్ 15R ధర దాదాపు రూ.44,999 ఉంటుందని అంచనా. వన్‌ప్లస్ 13R రూ.39,999 లాంచ్ ధర కన్నా కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. నివేదికల ఆధారంగా డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 25 మధ్య భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.