Video: హైకోర్టులో అసాధారణ ఘటన.. “హద్దులు దాటకండి” అంటూ జడ్జిని పట్టుకుని ఓ లాయర్.. అసలేం జరిగింది?
లాయర్ తివారీ.. "దేశం మంటల్లో కాలుతోంది. న్యాయ వ్యవస్థ వల్లే దేశం మంటల్లో కాలుతోంది" అని ఆగ్రహంగా అన్నారు.

Video: ఝార్ఖండ్ హైకోర్టులో అసాధారణ పరిణామం చోటు చేసుకుంది. ఒక జడ్జి, లాయర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్టోబర్ 16న జరిగిన ఓ విచారణలో హైకోర్టు జడ్జి జస్టిస్ రాజేశ్ కుమార్ చేసిన ఓ వ్యాఖ్యతో గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా లాయర్ మహేశ్ తివారీ తీవ్ర స్థాయిలో స్పందించారు.
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దాని ప్రకారం లాయర్ తివారీ.. “దేశం మంటల్లో కాలుతోంది. న్యాయ వ్యవస్థ వల్లే దేశం మంటల్లో కాలుతోంది” అని ఆగ్రహంగా అన్నారు. (Video)
వీడియో ఆయన వ్యాఖ్య స్పష్టంగా వినిపించింది. తివారీ వాదిస్తున్న తీరుపై జడ్జి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి తివారీ స్పందిస్తూ.. “నేను నాలానే వాదిస్తాను… ఎవరినీ అవమానించకండి… హద్దులు దాటకండి” అని ఘాటుగా సమాధానమిచ్చారు.
ఈ వాగ్వాదం తీవ్రతరం అవుతున్న సమయంలో.. రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్‌పర్సన్ రాజేంద్ర కృష్ణ సహా పలువురు లాయర్లు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఈ వీడియో వైరల్ అయిన వెంటనే.. హైకోర్టు లైవ్ లింక్‌ను తొలగించారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ ఈ ఘటనపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని తివారీని ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
న్యాయవ్యవస్థలో ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయి. ఈ ఘటనపై శుక్రవారం ఝార్ఖండ్ హైకోర్టులోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం.. తివారీ “ధిక్కార” తీరుపై విచారణ జరిపింది.
लोकतंत्र की सारी संस्थाओं की शुचिता धीरे धीरे खत्म होती जा रही है..
ये क्लीप झारखंड कोर्ट का है…जज और वकील संवाद देखिए, सुनिए फिर माथा पीट लीजिए… pic.twitter.com/XQ2reRkqt6
— Mamta Tripathi (@MamtaTripathi80) October 17, 2025