Happy Dhanteras 2025 : హ్యాపీ ధన్‌తేరాస్.. వాట్సాప్ స్టేటస్ వీడియో ఇలా డౌన్‌లోడ్ చేసి మీకు ఇష్టమైనవారికి షేర్ చేయండి.. సింపుల్ ప్రాసెస్..!

Happy Dhanteras 2025 : హ్యాపీ ధన్‌తేరాస్.. వాట్సాప్ స్టేటస్ వీడియో ఇలా డౌన్‌లోడ్ చేసి మీకు ఇష్టమైనవారికి షేర్ చేయండి.. సింపుల్ ప్రాసెస్..!

Happy Dhanteras 2025

Updated On : October 18, 2025 / 1:26 PM IST

Happy Dhanteras 2025 : 2025 ధన్‌తేరాస్ పండుగ సీజన్ మొదలైంది. ఈ ప్రత్యేకమైన రోజున అందరూ తమ ఇళ్లను అలంకరించి, దీపాలు వెలిగించి పండగను జరుపుకుంటారు. ఈరోజున బంగారం, వెండి లేదా ఏదైనా కొత్త వస్తువు కొనేందుకు అద్భుతమైన రోజు. ఈ ఏడాదిలో ధన్‌తేరాస్ అక్టోబర్ 18, 2025 వస్తుంది. దీపావళి మొదటి రోజుగా జరుపుకునే ధన్‌తేరాస్‌ను ధనత్రయోదశి అని కూడా పిలుస్తారు.

సాంప్రదాయ ఆచారాల ప్రకారం.. అదృష్టానికి ప్రతీకగా (Happy Dhanteras 2025) లక్ష్మీ దేవి, కుబేరుడు సంపదకు శుభప్రదంగా భావిస్తుంటారు. ధన్‌తేరాస్ రోజున వాట్సాప్ స్టేటస్ వీడియోల ద్వారా పండుగ శుభాకాంక్షలు షేర్ చేసుకుంటారు. మీరు కూడా మీ ప్రియమైనవారికి ధన్‌తేరాస్ శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే ఇదే అద్భుతమైన సమయం. మీ వాట్సాప్ ద్వారా ధన్‌తేరాస్ స్పెషల్ వీడియోను క్రియేట్ చేసి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయొచ్చు.

ధంతేరాస్ 2025 తేదీ, శుభ ముహూర్తం :
5 రోజుల దీపావళి పండుగలో మొదటి రోజు ధన్‌తేరాస్‌ను అక్టోబర్ 19, 2025న (శనివారం) జరుపుకుంటారు. పూజలు, కొత్త కొనుగోళ్లకు అత్యంత పవిత్రమైన రోజు. శుభ ముహూర్తం రాత్రి 07:29 గంటలకు ప్రారంభమై రాత్రి 08:20 గంటలకు ముగుస్తుంది. ఈ సమయం లక్ష్మీ పూజకు బంగారం, వెండి లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను కొనుగోలు, కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ రాబోయే సంవత్సరంలో శ్రేయస్సు, అదృష్టాన్ని తెస్తాయని నమ్ముతారు.

Read Also : Dhanteras Sale : ధన్‌తేరాస్ సేల్.. షావోమీ, శాంసంగ్ 43 అంగుళాల స్మార్ట్‌టీవీలపై అదిరిపోయే ఆఫర్లు.. సగం ధరకే కొనేసుకోండి..!

హ్యాపీ ధన్‌తేరాస్ 2025 వాట్సాప్ స్టేటస్ వీడియోలు :
వాట్సాప్‌లో హ్యాపీ ధన్‌తేరాస్ వీడియో స్టేటస్ షేర్ చేయాలనుకుంటున్నారా? యూట్యూబ్ లేదా గూగుల్‌లో “హ్యాపీ ధన్‌తేరాస్ 2025 వాట్సాప్ స్టేటస్ వీడియో డౌన్‌లోడ్” కోసం సెర్చ్ చేయండి. మీరు Canva, Pixabay, Pexels, Pinterest, Unsplash ప్లాట్‌ఫారాలపై ఫెస్టివల్ క్లిప్‌లను ఎంచుకోవచ్చు.

వాట్సాప్‌లో హ్యాపీ ధన్‌తేరాస్ వీడియో స్టేటస్‌ ఎలా అప్‌లోడ్ చేయాలి? :
ధన్‌తేరాస్ విషెస్ షేర్ చేయడం చాలా ఈజీ.. ఈ కింది విధంగా ట్రై చేయండి.

  • మీ వాట్సాప్ ఓపెన్ చేసి స్టేటస్ ట్యాబ్‌కు వెళ్లండి.
  • My Status > Photos & Videos ట్యాప్ చేయండి.
  • మీ గ్యాలరీ నుంచి ఎంచుకున్న ‘Happy Dhanteras’ వీడియోను ఎంచుకోండి.
  • ధన్‌తేరాస్ పండుగ క్యాప్షన్ ఏదైనా ఒకటి ఎంచుకోండి.
  • పండగ ఉత్సాహం కోసం ఎమోజి ఐకాన్లను ట్యాప్ చేయండి.
  • స్టేటస్ (కాంటాక్టులు) కింద మీ స్టేటస్ ఎవరు చూడాలో కస్టమైజ్ చేసుకోండి.
  • మీ ప్రియమైనవారికి విషెస్ తెలిపేందుకు షేర్ ఆప్షన్ ట్యాప్ చేయండి.