కవిత కొడుకు రాజకీయాల్లోకి ఎంట్రీ? కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసిన కవిత.. బంద్‌లో ఎందుకు పాల్గొన్నాడంటే?
తాను ధర్నా కార్యక్రమానికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు? అని తనను ఆదిత్య అడిగాడని కవిత చెప్పారు. ఆ తర్వాత..

K Kavitha: బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం బీసీ ఐకాస ఇచ్చిన పిలుపుతో ఇవాళ తెలంగాణ బంద్ కొనసాగుతోంది. రాష్ట్రంలో అత్యవసర సేవలు తప్ప మిగతా రంగాలపై బంద్ ప్రభావం కనపడింది. బంద్‌కు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించి, కీలక నేతలు ఇందులో పాల్గొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, ఆమె కుమారుడు ఆదిత్య కూడా బంద్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. దీంతో ఆదిత్య రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారని జరుగుతున్న ప్రచారంపై కవిత స్పందించారు.
Also Read: అమెరికా-రష్యాను కలుపుతూ “ట్రంప్-పుతిన్” టన్నెల్.. మస్క్ కంపెనీకి జాక్ పాట్? ఇక ఏం జరగనుంది?
తన కొడుకు వయసు చిన్నదేనని కవిత అన్నారు. రాజకీయాల్లో ప్రవేశించే అవసరం ఇప్పుడేం లేదని తెలిపారు. తాను ధర్నా కార్యక్రమానికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు? అని తనను అడిగాడని చెప్పారు.
దీంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నానని తన కొడుకుకి చెప్పానని తెలిపారు. తాను వస్తానని ఆదిత్య అని వచ్చి నిరసన తెలియజేశాడని వివరించారు.