×
Ad

Moto G06 Power : కొత్త మోటో G06 పవర్‌పై బిగ్ డిస్కౌంట్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

Moto G06 Power : మోటోరోలా G06 పవర్ ఫోన్ ధర తగ్గిందోచ్.. ఫీచర్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో కేవలం రూ. 5వేలకే కొనేసుకోవచ్చు.

1/6
Moto G06 Power : కొత్త మోటోరోలా ఫోన్ కొంటున్నారా? మీకో గుడ్ న్యూస్.. మోటోరోలా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ మోటో G06 పవర్ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి సేల్ సందర్భంగా ఈ మోటో జీ06 పవర్ సరసమైన ధరకే కొనేసుకోవచ్చు. భారీ 7,000mAh బ్యాటరీతో పాటు పవర్‌ఫుల్ ఎంట్రీ-లెవల్ ఫోన్ అత్యంత చౌకైన ధరకే లభిస్తోంది. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ మోటో G06 పవర్ బేస్ మోడల్ ప్రస్తుతం కేవలం రూ.7,499కి అందుబాటులో ఉంది. ఈ పండగ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
2/6
మోటో G06 పవర్‌పై బిగ్ డిస్కౌంట్ : ఈ మోటో G06 ఫోన్ కొనుగోలుపై బ్యాంక్ డిస్కౌంట్లతో మరింత తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్లతో అదనంగా రూ. 300 సేవ్ చేసుకోవచ్చు. తద్వారా మోటో G06 పవర్ ప్రారంభ ధర రూ. 7,199కి తగ్గుతుంది. మీ పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ. 5,450 వరకు తగ్గింపు పొందవచ్చు.
3/6
ఒకవేళ మీ పాత ఫోన్ రూ. 2,100 తగ్గింపు లభిస్తే.. ఈ మోటోరోలా ఫోన్ రూ. 5వేలకు సొంతం చేసుకోవచ్చు. అయితే, ఫైనల్ ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది పూర్తిగా మీ పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
4/6
మోటో G06 పవర్ కీలక ఫీచర్లు : ఫీచర్ : స్పెసిఫికేషన్ డిస్‌ప్లే : 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.88-అంగుళాల HD+ డిస్‌ప్లే ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో G81 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్ ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 15 ఆధారిత హీలియో యూఐ
5/6
స్టోరేజీ : 4GB ర్యామ్ + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ (మైక్రో SD ద్వారా 1TB వరకు ) బ్యాటరీ : 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పవర్‌ఫుల్ 7,000mAh బ్యాటరీ కెమెరా : 50MP ప్రైమరీ బ్యాక్ కెమెరా, 8MP సెకండరీ కెమెరా కనెక్టివిటీ : 4G, LTE, Wi-Fi, బ్లూటూత్‌ సపోర్టు
6/6
మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లపై దీపావళి డీల్స్ : ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్‌తో పాటు మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లోని అన్ని ఫోన్లపై బ్యాంక్ ఆఫర్లతో తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.