Fastest Charging Smartphones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. టాప్ 5 ఫాస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!
Fastest Charging Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ల కోసం చూస్తున్నారా? ఈ దీపావళి సీజన్‌లో టాప్ 5 ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్లలో ఏదైనా కొనేసుకోండి.

Fastest Charging Smartphones
Fastest Charging Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఈ దీపావళి పండగ సీజన్‌లో అద్భుతమైన బ్యాటరీ లైఫ్ అందించే స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో క్రేజీ ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కారణంగా ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు ఎక్కువ గంటలు వేచి ఉండాల్సిన పనిలేదు.
అనేక బ్రాండ్లు తమ స్మార్ట్‌ఫోన్‌లపై ఫాస్ట్ ఛార్జింగ్ (Fastest Charging Smartphones) సపోర్టుతో మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. వాస్తవానికి, బ్యాటరీ 30 నిమిషాల కన్నా తక్కువ సమయంలో 0 నుంచి 100 ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. 2025లో టాప్ 5 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కలిగిన స్మార్ట్‌ఫోన్లపై ఓసారి లుక్కేయండి.
వన్‌ప్లస్ 12 ప్రో :
ఈ వన్‌ప్లస్ 12 ప్రో ఫోన్ 120W పవర్‌తో వస్తుంది. ఛార్జ్ ఫ్లాట్-టు-ఫుల్ సైకిల్ దాదాపు 20 నిమిషాల నుంచి 25 నిమిషాల సమయం పడుతుంది. ఛార్జింగ్ సమయంలో కూడా అమోల్డ్ స్క్రీన్‌తో పాటు పర్ఫార్మెన్స్ పరంగా అత్యంత వేగంగా పనిచేస్తుంది.
షావోమీ 15 అల్ట్రా :
ఈ షావోమీ అల్ట్రా ఫోన్ 25 నిమిషాల్లోపు ఫుల్ ఛార్జ్ అవుతుంది. 120W హైపర్‌ఛార్జ్ ఇష్టపడే వారికి షావోమీ 15 అల్ట్రా బెస్ట్ ఫోన్. ఇందులో కెమెరాల పరంగా ఒక అంగుళం సెన్సార్ హెడ్‌తో స్పీడ్, పవర్ సహా అన్ని ఫీచర్లు ఒకే ప్యాకేజీలో పొందవచ్చు.
రియల్‌మి P3 ప్రో :
రియల్‌మి P3 ప్రో ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది. 0 నుంచి 100 శాతం వరకు ఫుల్ ఛార్జ్ అయ్యందుకు 30 నిమిషాల కన్నా ఎక్కువ సమయం పడుతుంది. ఈ భారీ 6000mAh బ్యాటరీతో వినియోగదారులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. గేమర్లు, ట్రావెలర్స్‌కు ఈ రియల్‌మి P3 ప్రో పరంగా అద్భుతంగా ఉంటుంది.
ఐక్యూ నియాన్ 10R :
ఈ ఐక్యూ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఐక్యూ నియో 10R ఏరియా 120W వద్ద ఫ్లాష్‌ఛార్జ్ కెపాసిటీని కలిగి ఉంది. 6400 మిల్లియాంపియర్-గంటల బ్యాటరీని కలిగి ఉంది. అంతేకాదు.. ఎక్కువ వర్కింగ్ అవర్స్, లో సిప్పింగ్ టైమ్ అందిస్తుంది. ఇవన్నీ గేమర్స్, మల్టీ టాస్కింగ్ యూజర్లకు అద్భుతంగా ఉంటుంది.
ఒప్పో ఫైండ్ X9 ప్రో :
ఈ ఒప్పో ఫైండ్ X9 ప్రో ఫోన్ దాదాపు 30 నిమిషాల నుంచి 35 నిమిషాలు ఛార్జ్ అవుతుంది. భారీ బ్యాటరీ, 100W సూపర్‌వూక్ ఛార్జింగ్ కలిగి ఉంది. ఈ ఫోన్ స్పీడ్ పరంగా అద్భుతంగా ఉంటుంది. ఫొటోగ్రాఫిక్ ఫీచర్ల పరంగా అద్భుతంగా ఉంటుంది. అత్యుత్తమ కెమెరా ఫీచర్లు కలిగిన ఫోన్లలో ఇదొకటి.