Virat Kohli : ఆసీస్‌తో తొలి వన్డే.. డకౌట్ అయిన కోహ్లీ.. లండన్‌కు బ్యాగ్ సర్దుకోవాల్సిందేనా?
ఆస్ట్రేలియాతో తొలి వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ విఫలం అయ్యాడు.

IND vs AUS 1st ODI Virat Kohli duck out after facing 8 deliveries
IND vs AUS : ఆస్ట్రేలియాతో తొలి వన్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కూపర్ కొన్నోలీ క్యాచ్ అందుకోవడంతో పెవియలిన్‌కు చేరుకున్నాడు. 8 బంతులు ఆడిన కింగ్ కోహ్లీ పరుగుల ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యాడు. దీంతో అతడి ఫ్యాన్స్ నిరాశచెందుతున్నారు.
ఇదే ఆఖరి సిరీస్..?
టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడడం తన లక్ష్యం అని ఇప్పటికే పలు సందర్భాల్లో పరోక్షంగా వెల్లడించాడు.
Rohit Sharma : ఏందీ సామీ ఇదీ.. ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలా ఔటైతివి.. ఇదే ఆఖరి సిరీస్ అయ్యేలా ఉందే..
Mitchell Starc gets Virat Kohli. pic.twitter.com/zsdEltOHRe
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2025
ఫిట్‌నెస్ పరంగా కోహ్లీకి ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే.. ఆ టోర్నీ వరకు అతడు ఫామ్‌లో ఉండడమే ఇక్కడ కీలకాంశం. వన్డే ప్రపంచకప్ ముందు టీమ్ఇండియా చాలా తక్కువ వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో ప్రతి మ్యాచ్ కూడా కీలకంగానే మారింది. మరోవైపు యువ ఆటగాళ్లు పోటీపడుతుండడంతో ఒక్క ఫార్మాట్‌లోనూ ఆడుతూ జట్టులో కోహ్లీ చోటు కాపాడుకోవడం చాలా కష్టం.
ఈ సిరీస్‌లో విఫలం అయితే కోహ్లీకి ఇదే చివరి సిరీస్ కావొచ్చునని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు హెడ్ కోచ్ గంభీర్ సైతం వన్డే ప్రపంచకప్ 2027లో కోహ్లీ ఆడడం పై క్లారిటీ ఇవ్వడం లేదు. ఇలాంటి సమయంలో ఆసీస్‌తో సిరీస్‌లో విజృంభి పరుగుల వరద పారించి తన సత్తా తగ్గలేదని నిరూపించుకుంటాడని అంతా భావించారు. అయితే.. తొలి వన్డేలో కోహ్లీ డకౌట్ అయ్యాడు. మిగిలిన రెండు వన్డేల్లో ఇలాగే ఆడితే మాత్రం అతడి వన్డే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.