Samsung Galaxy A35 5G : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్.. ఇలా కొన్నారంటే.. ఈ శాంసంగ్ 5G ఫోన్ జస్ట్ రూ. 14వేలు మాత్రమే.. డోంట్ మిస్!

Samsung Galaxy A35 5G : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

1/7Samsung Galaxy A35 5G
Samsung Galaxy A35 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో పాపులర్ శాంసంగ్ గెలాక్సీ A సిరీస్ ఫోన్ భారీ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫ్లాగ్‌షిప్ మోడల్ అతి తక్కువ ధరకే లభిస్తోంది.
2/7Samsung Galaxy A35 5G
అసలు ధర రూ. 33,999 నుంచి తగ్గి రూ. 14వేల కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. మీరు శాంసంగ్ అభిమాని అయితే.. ఈ 5జీ ఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ A35 5జీ ఫోన్ డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు.
3/7Samsung Galaxy A35 5G
ఈ శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫోన్ (8GB + 256GB) టాప్ మోడల్ ధర రూ. 33,999కు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ఈ శాంసంగ్ ఫోన్‌ను రూ. 14వేలు తగ్గింపు తర్వాత రూ. 19,999కి అందిస్తోంది. అలాగే, మీరు ఈ శాంసంగ్ 5జీ ఫోన్‌ కొనుగోలుపై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
4/7Samsung Galaxy A35 5G
అలాగే, రూ. 15,100 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ, మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ అన్నీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ నుంచే పొందవచ్చు.
5/7Samsung Galaxy A35 5G
శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫీచర్లు : శాంసంగ్ గెలాక్సీ A35 5జీ ఫోన్ 6.6-అంగుళాల సూపర్ అమోల్డ్ స్క్రీన్ 2340×1080 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్, 8GB ర్యామ్‌తో వస్తుంది. కంపెనీ ప్రాసెసర్ ఎక్సినోస్ 1380 చిప్‌సెట్ కలిగి ఉంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ 3 కెమెరాలు, సింగిల్ ఎల్ఈడీ లైట్ వంటి ఆప్షన్లు ఉన్నాయి.
6/7Samsung Galaxy A35 5G
8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 5MP మాక్రో సెన్సార్, 50MP మెయిన్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్‌లో 13MP ఫ్రంట్ కెమెరా ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఎనేబుల్ చేసే 5000mAh బ్యాటరీ ఫోన్‌కు పవర్ అందిస్తుంది.
7/7Samsung Galaxy A35 5G
ఈ శాంసంగ్ ఫోన్ బయోమెట్రిక్ సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ కలిగి ఉంది. వాటర్, డస్ట్ (IP67) రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ వన్ యూఐ 6.1, ఆండ్రాయిడ్ 14 ఆధారంగా రూపొందింది. 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.3, USB టైప్-C కనెక్టర్ కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఉన్నాయి.