Diwali 2025 : దీపావళి పండుగ రోజున లక్ష్మీపూజ ఏ సమయంలో చేయాలి..? ఏ రంగు దుస్తులు ధరించాలి? పూర్తి వివరాలు ఇవే..

Diwali 2025 : ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీన మధ్యాహ్నం 3.44 గంటలకు అమావాస్య తిథి ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 5.54గంటలకు ముగుస్తుంది.

Diwali 2025 : దీపావళి పండుగ రోజున లక్ష్మీపూజ ఏ సమయంలో చేయాలి..? ఏ రంగు దుస్తులు ధరించాలి? పూర్తి వివరాలు ఇవే..

diwali 2025

Updated On : October 19, 2025 / 8:34 AM IST

Diwali 2025 : ఇంటిల్లిపాది ఒకేచోట చేరి, టపాసులు కాల్చుతూ, విందు భోజనాలతో ఎంతో సందడిగా ఆనందంతో చేసుకునే పండుగల్లో దీపావళి పర్వదినం ఒకటి. అమావాస్య చీకట్లను తరమికొట్టి జీవితంలో వెలుగు జిలుగులు నింపే సంతోషాల సంబురంను ఘనంగా జరుపుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు సిద్ధమయ్యారు.

ప్రతీయేటా ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష అమావాస్య నాడు జరుపుకునే దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తాం. అయితే, ఈ పండుగ ఎప్పుడు చేయాలి.. లక్ష్మీ పూజ ఏ సమయంలో చేయాలనే విషయాలు తెలుసుకుందాం.

Also Read: ఈ వారం రాశిఫలాలు (అక్టోబర్ 19 నుంచి 25 వరకు).. వీరికి ఆకస్మిక ధనలాభము.. డబ్బుల వర్షం కురుస్తుంది..

ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీన మధ్యాహ్నం 3.44 గంటలకు అమావాస్య తిథి ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 5.54గంటలకు ముగుస్తుంది. దృక్‌సిద్ధాంత గణితం ఆధారంగా ఏ రోజున అయితే ప్రదోష కాలానికి సాయంత్రం, రాత్రి వేళలకు అమావాస్య తిథి వ్యాప్తి అయి ఉంటుందో ఆ రోజునే దీపావళి పండుగ చేసుకోవాలి.

ఆ లెక్కన ప్రదోష కాలానికి, రాత్రి సమయానికి అమావాస్య ఉండటం వల్ల అక్టోబర్ 20వ తేదీనే దీపావళి జరుపుకోవాలి. అదేరోజు లక్ష్మీ పూజ, పితృదేవతలకు దివిటీ చూపించడం, దీపదానం వంటివి ఆచరించడం మంచిది.

దీపావళి పండుగ రోజున లక్ష్మీ పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆ రోజు భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తాం. అయితే, అక్టోబర్ 20వ తేదీన దీపావళి పండుగ రోజు ఏ సమయంలో లక్ష్మీ పూజ చేయాలనే సందేహం అందరిలోనూ ఉంది. పండుగ రోజు సాయంత్రం 7.08గంటల నుంచి రాత్రి 8.18 గంటల మధ్య లక్ష్మీపూజ ఆచరించడానికి ఉత్తమ సమయం. అలాగే.. ప్రదోష కాలం సాయంత్రం 5.46 గంటల నుంచి రాత్రి 8.18 గంటల వరకు.. అదే వృషభ కాలం రాత్రి 7.08 నుంచి 9.03 గంటల వరకు ఉంటుంది.

దీపావళి రోజున లక్ష్మీపూజ చేయడం చాలా మంచిది. ఈ రోజు మహిళలు తప్పకుండా పసుపు రంగు దుస్తులు ధరించాలని పండితులు చెబుతున్నారు. పసుపు రంగు అనేది బృహస్పతి గ్రహాన్ని సూచిస్తుంది. అందువలన శాంతి, సంపదకు ప్రతీక అయిన పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.
అంతేకాక.. లక్ష్మీ పూజ సమయంలో ఎరుపు రంగు దుస్తులు కూడా ధరించ వచ్చు. ఎరుపు రంగు శక్తి, ధైర్యం, ప్రేమకు ప్రతిరూపమైనది. ఇది కుజ గ్రహంతో సంబంధం ఉంటుంది. ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజ చేయడం వల్ల ధనప్రాప్తి కలుగుతుందని నమ్మకం.
దీపావళి పండుగ రోజు తెలుపు రంగు దుస్తులు ధరించి లక్ష్మీ పూజ చేయడం మంచిదట. తెలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.