Trivikram : వంటల షో చూసి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్.. దెబ్బకి ఆమె లైఫ్ మారిపోయింది..
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన ఒక్క ఛాన్స్ తో ఆ నటి తన లైఫ్ మారిపోయింది అని చెప్పుకొచ్చింది.(Trivikram)

Trivikram
Trivikram : సినీ పరిశ్రమలో ఎవరికి ఎప్పుడు ఛాన్స్ వస్తుందో, ఎవరికి ఏ సినిమాతో లైఫ్ మారిపోద్దో తెలియదు. ఒక్క ఛాన్స్ సక్సెస్ అయితే సెటిల్ అయిపోయినట్టే. అలా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన ఒక్క ఛాన్స్ తో ఆ నటి తన లైఫ్ మారిపోయింది అని చెప్పుకొచ్చింది.(Trivikram)
ఇంతకీ ఆ నటి ఎవరో కాదు హరితేజ. సీరియల్స్, షోలు, యాంకరింగ్ తో గుర్తింపు తెచ్చుకున్న హరితేజ బిగ్ బాస్ లో పాల్గొని పాపులారిటీ తెచ్చుకుంది. ఇప్పుడు సినిమాల్లో నటిగా బిజీగా ఉంది. తాజాగా హరితేజ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు ఇచ్చిన అవకాశం గురించి తెలిపింది.
Also Read : Hariteja : నాకు కరోనా ఉన్నప్పుడు బేబీ పుట్టింది.. బేబీ పుట్టాక నాకు ఇవ్వలేదు.. హరితేజ ఎమోషనల్..
హరితేజ మాట్లాడుతూ.. అఆ సినిమా నా లైఫ్ ని మార్చేసింది. త్రివిక్రమ్ గారు అఆ సినిమాలో పనిమనిషి పాత్ర కోసం వెతుకుతూ ఉన్నప్పుడు ఓ రోజు టీవీ చూస్తూ ఛానల్స్ తిప్పుతూ ఉంటే ఒక వంటల షో చూసారంట. ఆ షోలో నేను వేసే జోకులు, వంటల మీద నా కామెడీ చూసి ఈ అమ్మాయిని పట్టుకురండి అని వాళ్ళ టీమ్ కి చెప్పారంట. నాకు ఫోన్ చేసి త్రివిక్రమ్ సినిమా అనగానే షాక్.
వెళ్లి ఆడిషన్ ఇచ్చాను. రిజల్ట్ ఏం చెప్పలేదు. వారం రోజులు అయిపోయింది. ఇంక ఈ సినిమా పోయినట్టే అనుకున్నాను. కానీ డైరెక్ట్ గా డేట్స్ కావాలని ఫోన్ చేసి అడిగారు. నాకు పాత్ర గురించి ఏమి తెలియకుండానే ఆ సినిమా చేసాను. ఆ సినిమా రిలీజ్ అప్పుడు స్టేజిమీద త్రివిక్రమ్ గారు హరితేజ ఈ జనరేషన్ సూర్యకాంతం అని చెప్పడంతో ఎమోషనల్ అయ్యా. త్రివిక్రమ్ గారు నా లైఫ్ మారిపోద్ది అని ఈ సినిమాతో అని షూటింగ్ టైములోనే చెప్పారు అని తెలిపింది.
Also Read : NTR : దేవర సినిమాలో ఈ నటిని ఎందుకు పెట్టుకున్నారు.. యాక్టింగ్ రాదు అంటూ కొరటాల శివని ప్రశ్నించిన ఎన్టీఆర్..
అఆ సినిమాలో హరితేజ సమంత వద్ద పనిమనిషి పాత్రలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో కనిపించి నవ్వించింది. ఆ పాత్ర ఎంతలా హిట్ అయిందంటే ఆ సినిమా తర్వాత హరితేజకు అన్నీ పనిమనిషి పాత్రలే వచ్చాయట. అఆ సినిమా తర్వాత హరితేజ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయింది.