NTR : దేవర సినిమాలో ఈ నటిని ఎందుకు పెట్టుకున్నారు.. యాక్టింగ్ రాదు అంటూ కొరటాల శివని ప్రశ్నించిన ఎన్టీఆర్..
తాజాగా హరితేజ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది.(NTR)

NTR
NTR : సీరియల్ నటి హరితేజ తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ లో పాల్గొని ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత అఆ సినిమాలో మంచి క్యారెక్టర్ పడటంతో నటిగా బిజీ అయింది. ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న హరితేజ తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.(NTR)
మొదటి సీజన్ బిగ్ బాస్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు ఎన్టీఆర్ కంటెస్టెంట్స్ తో సరదాగా ఉన్నారు. కంటెస్టెంట్స్ కూడా ఎన్టీఆర్ కి దగ్గర అయ్యారు. ఆ సీజన్ లో హరితేజ బుర్రకథ చెప్పి బాగా ఫేమస్ అయింది. హరితేజ ఎన్టీఆర్ చేసిన దేవర, అరవింద సమేత, దమ్ము సినిమాల్లో నటించింది. తాజాగా హరితేజ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది.
హరితేజ మాట్లాడుతూ.. బిగ్ బాస్ తర్వాత ఎన్టీఆర్ గారు ఎక్కడ కనిపించినా సరదాగా వెక్కిరించడం మొదలుపెట్టారు. దేవర సినిమా షూటింగ్ లో నన్ను చూసినప్పుడు కొరటాల శివ గారిని పిలిచి ఎన్టీఆర్ ఈ అమ్మాయిని ఎందుకు పెట్టుకున్నారు, ఈ అమ్మాయికి యాక్టింగ్ రాదు అని సరదాగానే అన్నారు. నేను థ్యాంక్యూ తారక్ గారు మీరు ఇప్పటికి బిగ్ బాస్ లోది మనసులో పెట్టుకున్నారు అన్నాను. అరవింద సమేతలో కూడా ఎందుకు పెట్టుకున్నారు ఈ అమ్మాయిని బాగా అల్లరి చేస్తుంది అని త్రివిక్రమ్ తో చెప్పారు. ఇప్పటికి కూడా ఆయన ఎక్కడ కనిపించినా ఎక్కిరిస్తారు నన్ను చూసి కామెడీగా అని తెలిపింది. దేవర సినిమాలో హరితేజ జాన్వీ కపూర్ ఫ్రెండ్ గా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో నటించిన సంగతి తెలిసిందే.
Also Read : Allu Arjun : వామ్మో.. అల్లు అర్జున్ అంటే హరితేజకు ఎంత ఇష్టమో.. బన్నీ కోసం ఏకంగా 15 రోజులు ఏం చేసిందో తెలుసా?